Health Tips: ప్రస్తుతం దైనందిన జీవితంలో మద్యపానం అలవాటు కామన్ అయిపోయింది. కొంత మంది పార్టీ కల్చర్ అంటూ మద్యం తాగుతూ ఉంటారు. ఈ మధ్య పురుషులతో సమానంగా మద్యపానం చేసే ఆడవాళ్ళు ఉన్నారు. వీటిలో ఎక్కువగా బీర్ తాగుతూ ఉంటారు. బీర్ త్రాగడం వలన అనారోగ్యానికి వచ్చిన నష్టమేమీ లేదని కొంత మంది చెబుతూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు బీరు తాగితే శరీరానికి చల్లదనం వస్తుందని కూడా చెబుతూ ఉంటారు. అలాగే శరీరంలో ఆల్కహాల్ ని ని బ్యాలెన్స్ చేయడంలో బీర్ కరెక్ట్ గా పనిచేస్తుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఇవన్ని వాస్తవమేనా అంటే కాదనే మాట వినిపిస్తుంది. కేవలం మద్యంప్రియులు మాత్రమే ఇలాంటి మాటలు చెబుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అసలు ఆల్కహాల్ అనేది శరీరానికి ఎప్పుడూ కూడా ప్రమాదమే అని వారు అంటున్నారు. 100 ఎంఎల్ బీరులో 30 నుంచి 35 కేలరీల శక్తి ఉంటుంది. అలాగే 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది శరీరంలో బరువుని పెంచుతుంది. అలాగే శరీరంలో ఎములక సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే ఈ బీర్ కారణంగా అత్యధిక క్యాలరీల శక్తి శరీరంలోకి వెళ్తుంది. ఏది ఫ్యాట్ రూపంలోకి మారిపోయి ఉబకాయం వస్తుంది. అలాగే బీరు ఎక్కువగా త్రాగడం వలన శరీరంలో మినరల్స్ తరిగిపోతాయి.
యూరిన్ ఎక్కువగా రావడం వలన మినరల్స్ యూరిన్ నుంచి విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మూత్రపిండాలు గ్రహిస్తాయి. దీంతో బీర్ ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రపిండాలు సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలా బీరు త్రాగడం వలన కేవలం పొట్టపెరగడంతో పాటు శరీరంలో అసంతుల్య పెరుగుదల ఉంటుంది. అలాగే గుండెపోటు లాంటి హార్ట్ సంబందిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఎవరైనా బీరు ఆరోగ్యానికి మంచిది అని చెబితే అస్సలు నమ్మోదు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.