Indian Cinema: టాలీవుడ్ టాల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి లేటెస్ట్ పిక్స్ కొన్ని నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత తెలుగులో మాస్ మహారాజా సరసన ఖిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమా ఫ్లాపైనా కూడా మీనాక్షికి మాత్రం మంచి పేరొచ్చింది. ఆ తర్వాత నటించిన హిట్ : ది సెకండ్ కేస్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది.
మీనాక్షి హైట్ అండ్ ఫిజిక్ చూస్తే అటు సీనియర్ హీరోలకి ఇటు యంగ్ హీరోలకి సరిపోయేలా ఉంటుంది. అందుకే, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీ సినిమాలో అలాగే, విక్టరీ వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనూ నటించి హిట్స్ అందుకుంది. మీనూ గా మీనాక్షి అటు గ్లామర్‌తో ఇటు పర్ఫార్మెన్స్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆకట్టుకుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన గోట్ సినిమాలో నటించిన మీనాక్షి తన ఒంపుసొంపులతో కుర్రాళ్ళని అల్లాడించింది.
మీనాక్షి ఫిజిక్ గురించి ప్రతేకంగా చెప్పాల్సి వస్తే అందాల ఆరబోతతో మోత మోగించగలదు. లక్కీ భాస్కర్ లాంటి డీసెంట్ సినిమాలలో హోంలీగా నటించి ప్రశంసలు అందుకోగలదు. అయితే, ఈ టాల్ బ్యూటీకి ఆశించిన పాన్ ఇండియా అవకాశాలే రావడం లేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలే ఇకపై మీనాక్షి రేంజ్ ను పెంచుతాయని ఎన్నో ఆశలు పెట్టుకుంది.
మీనూ చేతిలో ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనకా ఒకరాజు సినిమా ఉంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. అలాగే, అక్కినేని నాగ చైతన్య సరసన ఓ సినిమాను చేస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర మూవీలో ఓ కీలక పాత్రను చేస్తోంది. ఈ మూడు సినిమాలతో మీనూ స్టేటస్ మారబోతుందని గట్టి నమ్మకంతో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.