Health care: హిమోగ్లోబిన్ అనేది మన శరీరానికి ఎంతో అత్యవసరమైన ప్రోటీన్ అని చెప్పాలి హిమోగ్లోబిన్ మన శరీరంలో ఆక్సిజన్ ప్రతి కణానికి చేరవేస్తుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ స్థాయిలో తగ్గుతాయో అప్పుడు మన శరీరంలో కణాలకు ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. తద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇలా హిమోగ్లోబిన్ తగ్గటం వల్ల జరిగే అనర్థాలు గురించి అందరికీ తెలిసి ఉంటుంది కానీ హిమోగ్లోబిన్ తగ్గడానికి గల కారణాలను మాత్రం చాలా మంది గుర్తించలేరు.
హిమోగ్లోబిన్ మన శరీరంలో పూర్తిస్థాయిలో తగ్గిపోవడానికి ప్రధాన కారణం మన శరీరంలో విటమిన్ల లోపం అని చెప్పాలి. ఎప్పుడైతే మన శరీరంలో ఐరన్ విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్ లోపిస్తుందో ఆ సమయంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పూర్తిగా తగ్గిపోయి అది ఎనీమియాకు దారితీస్తుంది.ఇక ఎక్కువగా బ్లీడింగ్ జరగడం మరో కారణం. అంటే మహిళల్లో అయితే పీరియడ్స్, సర్జరీ సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొందరికి బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా హిమోగ్లోబిన్ లోపానికి ప్రధాన కారణమని చెప్పాలి.
మరి హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గకుండా ఉండాలి అంటే మనకు బీ 12 విటమిన్ అలాగే ఐరన్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం. దీనికోసం పాలకూర, బీట్ రూట్, అంజీర్, పప్పులు, మాంసం, చికెన్ వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే పదార్ధాలు తీసుకోవాలి. విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, గుడ్లు, ఆకు కూరలు, ఆరెంజ్ తరచూ తీసుకోవాలి. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ స్థాయిలో తగ్గిపోతాయో తీవ్రమైన అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పసుపుగా మారడం, తలనొప్పి, గుండె చప్పుడు తీవ్రమవడం వంటి లక్షణాలు కనబడతాయి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.