Eye Tips: సాధారణంగా చలికాలంలో చాలామంది కళ్ళు తొందరగా పొడిబారి ఎర్రగా మారుతూ ఉంటాయి. ఇలా కళ్ళు కనక పొడిబారినట్లు అయితే కళ్ళు మంటలు రావడం జరుగుతుంది. ఇలా కళ్ళు ఎర్రగా మారి ఇబ్బంది పడేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల కళ్ళు ఎరబడటం తగ్గిపోతుంది. మరి కళ్ళు ఎర్రగా మారకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే..
కళ్ళు పూర్తిగా పొడి బారినప్పుడే ఎర్రగా మారుతాయి అందుకే కళ్ళను ఎప్పుడు తేమగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అందుకే మన కంటిలోకి మార్కెట్లో లభించే కృతమ కన్నీటిని రెండు చుక్కలు వేసుకోవడం వల్ల ఈ కన్నీళ్లు కంటిపై భాగంలో పొరల ఏర్పడి మన కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. ఇలా చలికాలంలో రెండు చుక్కలు కృత్రిమ కన్నీళ్లను వేసుకోవడం ఎంతో మంచిది.
వీటితోపాటు మనం ఎక్కువగా చల్లగాలికి గురి కాకుండా అదే విధంగా సూర్యకాంతి మనపై పడకుండా ఉండాలి అంటే బయటకు వెళ్లిన ప్రతిసారి కళ్ళకు రక్షణ కల్పించుకొని వెళ్లాలి అంటే మంచి సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్లడం వల్ల సూర్య కాంతి నేరుగా మన కళ్ళపై పడదు అదేవిధంగా దుమ్ము ధూళి కూడా కళ్ళల్లో పడదు. ఇకపోతే మన శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉన్నప్పుడే కళ్ళు కూడా పొడిబారవు అందుకే తరచూ నీటిని తాగుతూ ఉండాలి. వీటితోపాటు తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం. మనకు సుమారు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి సమస్యలు అనేవి తలెత్తవు.