Deepavali: ప్రతి ఏడాది దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవికి పూజ చేసి ఇల్లు మొత్తం దీపాలతో ఎంతో అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఇలా ఇంట్లో దీపాలు వెలిగించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం చెంది అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని భావిస్తారు. ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా దీపావళి పండుగ రోజు ఎంతో ఘనంగా పూజ చేసి ఇల్లు మొత్తం దీపాలతో అలంకరించుకుంటారు. అయితే ఇంట్లో దీపావళి పండుగ రోజు కొన్ని ప్రదేశాలలో దీపాలు పెట్టడం వల్ల సకల దేవతల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది.
మరి దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఎక్కడెక్కడ దీపాలు వెలిగించాలి అనే విషయానికి వస్తే ముందుగా దేవుని గదిలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయాలి అనంతరం ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా పువ్వులతో ఎంతో అందంగా అలంకరించి దీపాన్ని అక్కడ వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషపడి మన ఇంటి అడుగు పెడతారని భావిస్తారు. అందుకే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా దీపం వెలిగించాలి అలాగే తులసి కోట వద్ద కూడా దీపం వెలిగించాలి.
సమస్త జీవరాసులకు నీరు చాలా ప్రాణదారం కనుక మన ఇంటి కొళాయి వద్ద లేదా బావి వద్ద కూడా దీపం వెలిగించడం ఎంతో శుభసూచికం ఇక రావి చెట్టులో సకల దేవతలు కొలవై ఉంటారని భావిస్తారు. అందుకే మన ఇంటి పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే తప్పనిసరిగా రావి చెట్టు కింద కూడా దీపం వెలిగించడం ఎంతో మంచిది. ఇక మన ఇంటికి సమీపంలోనే ఆలయం ఉంటే కనుక ఆలయంలో కూడా దీపాలు వెలిగించాలి. ఇక ఆహారం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం కనుక మనం స్టోర్ రూమ్ లో కూడా కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ దీపం వెలిగించడం మంచిది. ఇక చాలామందికి తమ వాహనాలే ఆస్తిగా ఉంటాయి ఇలా వాహనాలు ఉన్నవారు జాగ్రత్తలను పాటిస్తూ వాహనాల ముందు కూడా దీపం వెలిగించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.