Holi: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటారు.ఈసారి, హోలీ పండుగను మార్చి 25, 2024న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఇక హోలీ పండుగ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు హోలీ పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా హోలిక పూజను జరుపుకొని ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అయితే హోలీ పండుగ రోజు తులసితో ఈ చిన్న పనిచేయడంతో జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి చాలా సంతోషంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో ప్రతికూల శక్తి కనిపిస్తే, హోలీ రోజున గంగాజలంలో తులసి ఆకులను వేసి పూజ స్థలంలో ఉంచండి. పూజ అయిపోయిన తర్వాత ఇంటి లోపల, బయట గంగాజలం చల్లండి. దీని వల్ల ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ మాయమైపోయి. ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఇక చాలామంది హార్దిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.
ఇలా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సిరిసంపదలు కలగాలి అంటే పూజ అనంతరం ఎరుపు రంగు క్లాత్ తీసుకుని దానిలో మూడు తులసి ఆకులను వేసి, అల్మారాలో కానీ మీరు మీ డబ్బును దాచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల పట్టిన దరిద్రం తొలగిపోయి మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాము అంతేకాకుండా మనకు సిరిసంపదలు కూడా పెరుగుతాయి. అందుకే హోలీ పండుగ రోజు ఈ చిన్న పరిహారాలను పాటించడంతో ఎంతో సంతోషంగా గడపవచ్చు.