Vastu Tips: సాధారణంగా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోక తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి సందర్భాలలో కొన్ని పూజలు చేయడం వల్ల దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన పువ్వుతో దేవుణ్ణి ప్రార్థించటం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు దూరం అవుతాయి. ఇప్పుడు మనం ఆ పువ్వుల గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కబంద పుష్పానికి చాలా ప్రత్యేకత విశిష్టత ఉంది. కబంద పుష్పాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి… జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో కదంబ పుష్పన్ని చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ పుష్పం శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమైనది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు కబంద వృక్షంపై కూర్చుని వేణును వాయించేవాడు. జీవితంలో సమస్యలతో సతమతమవుతున్న వారు కబంద పుష్పాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించే పూజించడం వల్ల ఆయన అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణ భగవానుడికి కదంబ పుష్పాన్ని సమర్పించడం ద్వారా బృహస్పతి బలపడతాడు. దీంతో ఆ వ్యక్తి వ్యాపార, విద్యా, ఉద్యోగాలలో పురోగతిని కూడా సాధిస్తాడు. అంతే కాకుండా కబంద పుష్పాన్ని పైలాన్ రూపంలో ఇంటి ప్రధాన ద్వారం పై ఉంచితే ఇంట్లో ప్రతికూలత తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. అలాగే ఈ పువ్వుని ఇంటి పూజ గదిలో లేదా మీ ఖజానాలో ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి, విష్ణువు ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే భార్యాభర్తలు కలిసి శ్రీకృష్ణుడిని, రాధ కు కబంధ పుష్పాలను సమర్పిస్తే వారి వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా ఉంటాయి.