Bramha Muhurtham: సాధారణంగా మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రయత్నాలు చేస్తాము. ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో ఈ రెండు పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. మరి బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సినటువంటి ఆ పనులు ఏంటి అనే విషయానికి వస్తే…
బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 5: 30 నిమిషాల మధ్య సమయంలో ఉన్న కాలాన్ని బ్రహ్మ కాలం లేదా బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయంలో మనం నిద్రలేచి కాల కృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఆ భగవంతుడిని స్మరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు. ఈ సమయంలో దేవతలు, దేవతల పరివారం తీర్థయాత్రలు చేస్తారని నమ్ముతారు.
అందుకే ఈ సమయంలో మనం భగవంతుని మంత్రాలను జపిస్తే ఆయన సంతోషించి, కోర్కెలు నెరవేరుస్తాడు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్నానం చేసే ఉతికిన బట్టలలో స్మరించుకోవాలి. అయితే భగవంతుడిని స్మరించుకునే సమయంలో ఈ రెండు మంత్రాలను చదువుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం మాత్రమే కాకుండా సకల దేవతల అనుగ్రహం కూడా మనపైనే ఉంటుంది.
బ్రహ్మ మురారి త్రిపురాంతకరీ భానుః శశి భూమి సుతో బుధశ్చ|
బృహస్పతి శుక్రుడు శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతి కరా భవన్తు||
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యా సరస్వతీ
కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్||
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.