ఒకేసారి ఐదు రూపాయలో, ఆరు రూపాయలో పెంచితే జనం రోడ్లపైకి వస్తారు, రాజకీయంగా నష్టం జరుగుతుంది. అందుకే ఇప్పుడు వ్యూహం మార్చారు. నాలుగు రోజుల క్రితం మూడు రూపాయలు పెంచిన చమురు సంస్థలు, ఆ వేడి చల్లారకముందే తాజాగా మరో 90 పైసలు వడ్డించాయి. వారం తిరిగేసరికి రూపాయి, రెండు రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయే ఈ మైక్రో మేనేజ్‌మెంట్ వ్యూహం వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. రోజువారీగా లేదా వారానికోసారి పైసల రూపంలో పెంచడం వల్ల వినియోగదారుడు పెద్దగా రియాక్ట్ అవ్వడు. కానీ, నెల తిరిగేసరికి అది నాలుగు నుండి ఐదు రూపాయల భారంగా మారి, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.
అంతర్జాతీయ ట్రెండ్స్ ప్రకారం ధరలు పెరగడం సహజమే అని సరిపెట్టుకుందాం. కానీ, అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు పాతాళానికి పడిపోయినప్పుడు ఆ ప్రయోజనం సామాన్యుడికి ఎందుకు దక్కలేదు? అప్పుడు మార్కెట్ సూత్రాలు ఏమయ్యాయి? ముడిచమురు చౌకగా దొరికిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం పన్నుల పెంపుతో తన ఖజానాను నింపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది కానీ, లీటర్ ధరను యాభై రూపాయలకు తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా, ఇంధన ధరలు ఎప్పుడూ ఒక గరిష్ట స్థాయిలోనే స్థిరపడిపోయాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో సంక్షోభం రాగానే, ఆ భారాన్ని యథావిధిగా జనం నెత్తినే రుద్దుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కేవలం బంకుల దగ్గరితోనే ఆగదు. డీజిల్ ధర పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగితే ఉల్లిపాయల దగ్గర నుంచి పప్పుల వరకు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. చివరకు మిగిలేది ఒక్కటే ప్రశ్న.. అంతర్జాతీయంగా నష్టాలు వస్తే భరించాల్సింది ప్రజలేనా? లాభాలు వస్తే దాచుకోవాల్సింది ప్రభుత్వ ఖజానాయేనా? సబ్ కా సాత్ అంటే సామాన్యుడిని ముంచడమేనా మోదీ సాబ్?
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.