Human Life: ఈ అనంత విశ్వంలో మరణం లేకుండా మనిషి జీవితం ఉంటుందా. అమరత్వం సాధ్యం అవుతుందా అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. ఇక మన పురాణ ఇతిహాసాల ప్రకారం చూసుకుంటే అమరత్వం కోసం కఠోర తపస్సు చేసిన అసురులు సైతం చావుని జయించలేకపోయారు. చివరికి మానవజన్మ ఎత్తిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సైతం అమరత్వాన్ని పొందలేకపోయారు. భౌతికంగా వారు కూడా మరణించారు. ఇలా తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ప్రాణి కచ్చితంగా ఏదో ఒక రోజు మరణిస్తుంది. అది సృష్టి ధర్మం ఈ సృష్టిలో మానవ జన్మ ఎత్తిన కేవలం ఐదు మంది మాత్రమే చిరంజీవులుగా ఉన్నారు. ఎన్నో తరాలుగా ఎంతో మంది అమరత్వం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
అయితే అది సాధ్యం కావడం లేదు. ప్రకృతి విరుద్ధమైన అమరత్వం సాధ్యం కాదు అని అనేక ఘట్టాలు నిరూపించాయి. ఇదిలా ఉంటే 2030 తర్వాత అమరత్వం సాధ్యమే అని ఒక గూగుల్ మాజీ ఇంజనీర్ రే కర్ణవీల్ అంటున్నారు. మనిషికి మరణం లేని జీవితం సాధ్యం అవుతుందని ఆయన చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆయన వేసిన అంచనాలలో 86 శాతం వరకు నిజం కావడమే ఇప్పుడు ఈ మాటలు హాట్ టాపిక్ గా మారాయి. జెనెటిక్స్, నానోటెక్నాలజీ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో మనిషికి అమరత్వం సాధ్యమవుతుందని తన యూట్యూబ్ ఛానెల్ అడాజియోలో పోస్ట్ చేసిన వీడియోలో రే కర్జ వీల్ పేర్కొన్నారు.
ఏజ్ ని రివర్స్ చేయగలిగే నానోబోట్లను నానోటెక్నాలజీ, రోబోటిక్స్ అభివృద్ధి చేస్తాయని, కణజాలాలను పునరుద్ధరిస్తాయని, రోగ నిరోధక శక్తిని కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. వయసు మీద పడకుండా చేసే ఈ నానోబోట్లతో మనిషికి అమరత్వం సాధ్యం అవుతుందని ఆయన బలంగా చెబుతున్నారు. టెక్నాలజీలో వస్తున్న అభివృద్ధి నానో టెక్నాలజీ మానవ సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుందని చెబుతున్నారు. ఈయన చెప్పిన చాలా ఘటనలు నిజం కావడంతో ఇప్పుడు ఇది సాధ్యమవుతుందా అనే కోణంలో అందరూ చూస్తున్నారు.