Tue. Jan 20th, 2026

    Huma Qureshi : బాలీవుడ్ నటి హుమా ఖురేషి లేటెస్ట్ ఫ్యాషన్ ఎంపికలతో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా బోల్డ్ అండ్ గ్లామరస్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లను అందిస్తుంటుంది. ఇటీవల, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తొడ-ఎత్తైన స్లిట్ తో వచ్చిన పర్పుల్ కలర్ డ్రెస్‌లో దిగిన స్టైలిష్ ఫోటోలను పంచుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit
    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit

    హుమా ఖురేషి ఒక అవార్డ్ షో కోసం ఈ డీప్ నెక్ పర్పుల్ అవుట్‌ఫిట్‌ ధరించింది. పర్పుల్ రంగు ఈ భామ మేని ఛాయకు బాగా సెట్ అయ్యింది. ఈ బ్యూటీ ఎంతో అందంగా కనిపించింది. ఈ డ్రెస్‌తో బోల్డ్ అండ్ గ్లామరస్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లను అందిస్తోంది ఈ చిన్నది. ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్థులను చేస్తోంది.

    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit
    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit

    హుమా ఆఫ్‌షోల్డర్స్, డీప్ స్వీట్ హార్ట్ నెక్‌లైన్‌, తొడి ఎత్తైన స్లిట్ తో వచ్చిన డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ బొద్దుగుమ్మే అయినా ఈ లుక్‌లో అదరగొట్టింది. ఫ్యాషన్ తో ప్రయోగాలు చేయడంలో హుమా ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. అయితే వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌ అయినా, ఎత్నిక్ డ్రెస్ అయినా తన ఫిగర్‌కు పెర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటుంది ఈ చిన్నది.

    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit
    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit

    ఈ బ్యూటీ ధరించే ఏ డ్రెస్ అయినా ఆమె అందులో ఒదిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బోల్డ్ లుక్స్ లోనూ కనిపించేందుకు ఏమాత్రం మొహమాటం పడదు. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ అవుట్‌ఫిట్‌.

    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit
    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit

    సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే బాలీవుడ్ బ్యూటీల్లో హుమా ఖురేషీ ఒకరు. ఈ చిన్నది స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సారి అదిరిపోయే లుక్ లో కనిపిస్తూ అదరగొడుతుంది. ఎప్పటికప్పుడు ఈ చిన్నది హాట్ ఫోటో షూట్‌ లు చేస్తూ మెస్మరైజ్ చేస్తుంది. ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది.

    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit
    huma-qureshi-stunning-looks-in-amazing-purple-colour-out-fit

    వృత్తిపరంగా, హుమా చివరిసారిగా డబుల్ ఎక్స్‌ఎల్‌లో బిగ్ స్క్రీన్‌పై తళుక్కుమంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హాతో జతకట్టింది. ఈ మూవీలో బాడీషేమింగ్‌ను ఎదుర్కొన్న బొద్దుగుమ్మలుగా హుమా, సోనాక్ష నటించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్‌ను సృష్టించలేకపోయింది. అంతకు ముందు, హుమా మోనికా ఓ మై డార్లింగ్‌లో నటించింది. ఈ చిత్రం ప్రేమ , హత్యల చుట్టూ తిరిగే థ్రిల్లర్.