Hair Tips: జుట్టు అందంగా పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అయితే కొన్ని కారణాలవల్ల కాలుష్యం కారణంగా లేదా మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు తక్కువ అయినప్పుడు కూడా జుట్టు బలహీనపడి ఎక్కువగా రాలిపోవడం లేదా విరిగిపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది. ఇలా జుట్టు బలహీన పడటం వల్ల జుట్టు రాలిపోయే సమస్య కూడా అధికంగా ఉంటుంది. మరి ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి లవంగాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
మన వంటింట్లో పుష్కలంగా లభించే లవంగాల ద్వారా జుట్టు కుదుళ్లను మనం బలంగా తయారు చేసుకోవచ్చు. మరి జుట్టు కుదుళ్లు బలంగా తయారు కావాలి అంటే లవంగాలతో ఏ విధంగా చేయాలి అనే విషయానికి వస్తే.. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి రెండు పెద్ద గ్లాసుల నీటిని వేసి మీరు బాగా మరుగుతున్న సమయంలో ఒక టేబుల్ స్పూన్ లవంగాలు వేయాలి. వీటితోపాటు రెండు ఎర్రని మందార పువ్వులు అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసి మరిగించాలి. అన్నం వేసినటువంటి రెండు గ్లాసుల నీరు సగం అయ్యేవరకు చిన్న మంటపై మరిగించాలి.
ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లబడిన తర్వాత వీటిని పడబోసుకోవాలి. ఇలా వడపోసుకున్నటువంటి ఈ మిశ్రమంలోకి ఒక టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్లో నింపి మనం తలస్నానం చేయడానికి ఒక రెండు గంటల ముందు జుట్టు కుదుళ్లకు బాగా రాయాలి ఇలా రాసిన తర్వాత రెండు గంటలకు మైండ్ షాంపుతో స్నానం చేయటం వల్ల జుట్టుకుదుళ్లు దృఢంగా తయారవుతాయి.