Health Benefits: సాధారణంగా మనం పొలాల గట్ల మధ్య ఎన్నో రకాల ముళ్ళు జాతికి చెందినటువంటి మొక్కలను చూస్తుంటే ముఖ్యంగా ఎడారి జాతి మొక్కలు అయినటువంటి కాక్టస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము అయితే వీటిలో ఎన్నో రకాల జాతులు ఉంటాయి కొన్నింటిని మనం ఇంట్లో కూడా పెంచుకునేలాగా ఉంటాయి అయితే ఎడారి మొక్కలే కదా అని వీటిని తేలికగా తీసేస్తే మనం పొరపాటు పడినట్లే వీటిలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాక్టస్ మొక్కల్లో బ్రహ్మజెముడు వర్గానికి చెందిన చపాతి కాక్టస్ మొక్క మన ఆరోగ్యాన్ని రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీని ఆకులు చపాతి ఆకారంలో ఉంటాయి. అందుకే దీన్ని ఆ విధంగా పిలుస్తారు. ఈ మొక్క ఆకులు, పండ్లలో క్యాల్షియం, విటమిన్లు, మెగ్నీషియం, బీటాకెరోటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ మొక్క పండ్ల జ్యూస్ మరియు జెల్లీ ప్రస్తుతం మార్కెట్లో కూడా దొరుకుతుంది.
అతి బరువు సమస్యతో బాధపడేవారు కాక్టస్ జ్యూస్ ప్రతి రోజూ ఒక గ్లాస్ తాగడం వల్ల మన శరీర బరువును తొందరగా తగ్గించుకోవచ్చు . ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది కనుక ప్రతిరోజు ఉదయం ఈ జ్యూస్ ఒక క్లాస్ తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఈ పనుల నుంచి మనం యాంటీ ఆక్సిడెంట్ పొందవచ్చు.
కాక్టస్ మొక్కలో అధిక శాతం ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు రుతు చక్ర సమయంలో విపరీతమైనటువంటి కడుపునొప్పి ఉంటుంది అలాంటివారు వీటిని తీసుకోవటం వల్ల నొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం పొందుతారు. తరచూ ఈ జ్యూస్ తాగటం వల్ల డిహైడ్రేషన్ నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇలా కాక్టస్ జాతికి చెందినటువంటి ఆకులు, పండ్లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయని వీటిని తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు.