Back Pain: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏదైనా సమస్యతో బాధపడుతున్నారు అంటే అది నడుము నొప్పి సమస్య అని చెప్పాలి చిన్న వయసు వారు కూడా విపరీతమైనటువంటి నడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నారు ఎక్కువసేపు కూర్చో పనిచేయడం అలాగే మారిన ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే ఎంతోమంది నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ఇలా నడుము నొప్పి సమస్యతో బాధపడేవారు ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందాలి అంటే కొన్ని పద్ధతులను అనుసరించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నడుపునొప్పి సమస్యతో బాధపడేవారు ముందుగా వారి ఆహారంలో విటమిన్స్ కాల్షియం పొటాషియం వంటి ఆహార పదార్థాలు అధికంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు గుడ్లు పప్పు దినుసులను కూరగాయలను ఎక్కువగా వారి ఆహారంలో చేర్చుకోవాలి. వీటితోపాటు ప్రతిరోజు వ్యాయామం చేయటం ఎంతో అవసరం ఇలా శారీరక వ్యాయామం చేయటం వల్ల ఈ నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇక చాలా మంది ఎక్కువసేపు కూర్చొని పని చేయటం వల్ల కూడా నడుము నొప్పి సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే ఒకే చోట గంటల తరబడి కూర్చోకుండా ప్రతి గంటకు ఒకసారి అలా నడుస్తూ ఉండడం వల్ల కూడా ఈ నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే పని చేసేటప్పుడు నిటారుగా కూర్చుని కంప్యూటర్ల ముందు పని చేయటం ఎంతో అవసరం. ఇక రాత్రిపూట పడుకునే సమయంలో తప్పనిసరిగా కాళ్లు కింద దిండు వేసుకొని పడుకోవటం వల్ల కూడా ఈ నొప్పి నుంచి మనం ఉపశమనం పొందవచ్చు.