Spiritual: మనం మన పురాణాల ప్రకారం హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాల ప్రకారం ఎన్నో రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటాము. ఇప్పటికీ మనం కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు వాటన్నింటినీ కూడా సంప్రదాయబద్ధంగా చేస్తూనే ఉంటాము. అయితే శుభకార్యాలు జరిగే సమయంలో చాలామంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఉంటారు.
ఇకపోతే పెళ్లి జరిగిన సమయంలోను లేదంటే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలోనూ చాలామంది కుడికాలు మాత్రమే లోపల పెట్టి రావాలని చెబుతూ ఉంటారు. మరి కుడికాలు ఎందుకు పెట్టాలి, ఎడమ కాలు పెడితే ఏంటి రెండు కూడా మన శరీరంలో భాగమే కదా ఇలాంటి వ్యత్యాసం దేనికి అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తారు. మరి శుభకార్యాల సమయంలోనే లేదంటే కొత్త కోడలు ఇంట్లోకి వచ్చిన సమయంలో కుడికాలు ఎందుకు పెట్టి రావాలి పురాణాలు ఏం చెబుతున్నాయనే విషయానికి వస్తే..
కుడికాలు ముందు పెట్టడం వల్ల శుభానికి సంకేతంగా భావిస్తారని,అన్ని శుభాలు జరుగుతాయని ఏ విధమైనటువంటి అ శుభాలకు తావు ఉండదని భావిస్తూ ఉంటారు. అందుకే కుడి కాలు ముందు పెట్టి వస్తారు.ఉదాహరణగా పురాణ కాలం నాటి అంశాన్ని కూడా పండితులు ప్రస్తావిస్తారు. సీతమ్మను రావణాసురుడు లంకకు తీసుకుని వెళ్ళినపుడు ఆమె జాడ కోసం వెతికే సమయంలో ఎడమ పాదం పెట్టి వెళ్ళాడట. అందుకే రావణ సంహారం జరిగిందని, ఎడమ పాదం అశుభ సూచకమని అంటారు.