Honey Water: సాధారణంగా చాలా మంది వారి ఆహారంలో భాగంగా తేనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం చాలామంది గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకొని నిమ్మరసం కలిపి ఆ నీటిని తాగుతూ ఉంటారు ఇలా తాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోయి సమస్య నుంచి బయటపడటమే కాకుండా శరీర బరువు కూడా తగ్గటానికి వీలు అవుతుందని భావిస్తుంటారు. ఇలా ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం కలిపి త్రాగడం ఎంతో మంచిది.
ఈ విధంగా గోరువెచ్చని నీటిలోకి తేనె కలిపి తాగే సమయంలో చాలామంది తమకు తెలియకుండా చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి పొరపాట్లు ఏంటి అనే విషయానికి వస్తే..చాలామంది వేడి నీటిలో తేనె కలుపుకొని తాగాలని భావించి నీరు బాగా ఉడుకుతున్న సమయంలో తేనెను వేసి చిన్న మంటపై కాసేపు ఉడకనిస్తారు. ఈ విధంగా తేనె కలిపిన నీటిని ఉడికించడం వల్ల తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నింటిని కోల్పోతాము. అలాంటప్పుడు ఈ నీటిని త్రాగిన ఎలాంటి ప్రయోజనము ఉండదు.
Honey Water:
ఇకపోతే ఆ నీరు కాస్త రుచిగా ఉండడం కోసం చాలామంది కొంత ఎక్కువ పరిమాణంలో తేనె కలుపుకొని తాగుతుంటారు. ఇలా తేనె అధికంగా కలుపుకొని త్రాగటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అందుకే తగిన పరిమాణంలో తేనె కలుపుకొని తాగటం ఎంతో ముఖ్యం అదేవిధంగా ముందుగా నీటిని వేడి చేసి నీరు గోరువెచ్చగా అయిన తర్వాత అందులోకి తేనె నిమ్మరసం కలిపి తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ప్రతిరోజు ఉదయం గోరు వెచ్చని నీటిలోకి తేనె కలిపి తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది అలాగే అధిక శరీర బరువుతో బాధపడేవారు బరువు తగ్గాలన్న ఊబకాయ సమస్య నుంచి బయట పడాలన్న ఈ తేనె కలిపిన నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.