Thu. Feb 12th, 2026

    Honey Rose: హానీ రోజ్ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరసింహారెడ్డి సినిమాతో బాలకృష్ణకి జోడీగా ఈ మల్లు బ్యూటీ నటించింది. అక్కడ సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.

     Honey Rose-saree-looks-goes-viral
    hony-rose-saree-looks-goes-viral

    2005లో నటిగా కెరియర్ ప్రారంభించిన హనీ రోజ్ తన రెండో సినిమాని తెలుగులో శివాజీ హీరోగా తెరకెక్కిన ఆలయం అనే మూవీతో టాలీవుడ్ లోకి అడుగు`పెట్టింది. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తరువాత తెలుగు తెరపై మళ్ళీ కనిపించలేదు.

     Honey Rose-saree-looks-goes-viral
    hony-rose-saree-looks-goes-viral

    ఆమె కెరియర్ లో ఎక్కువగా మలయాళీ సినిమాలలోనే నటించింది. ఇక గత ఏడాది మోహన్ లాల్ డబ్బింగ్ మూవీస్ బిగ్ బ్రదర్, మోనిస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ఇక మోనిస్థర్ సినిమాలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.

     Honey Rose-saree-looks-goes-viral
    hony-rose-saree-looks-goes-viral

    ఇందులో మంచు లక్ష్మి, హనీ రోజ్ లెస్బియన్ గర్ల్ ఫ్రెండ్స్ గా నటించారు. ఇందులో ఇద్దరు క్లైమాక్స్ లో ముద్దు సన్నివేశంలో కూడా నటించడం విశేషం. ఇదిలా ఉంటే ఆ సినిమాలతో డిజిటల్ లో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణతో ఆడిపాడింది.

     Honey Rose-rose-saree-looks-goes-viral
    hony-rose-saree-looks-goes-viral

    అటు ప్రియురాలిగా, మరో వైపు తల్లిగా భిన్నమైన పాత్రలలో హనీరోజ్ నటించి మెప్పించింది. ఈమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంది. ఈ మూవీతో సీనియర్ హీరోలకి హనీ రోజ్ కరెక్ట్ జోడీ అవుతుందనే మాట ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఆమె ఫోటోలు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సర్కిల్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి.

     Honey Rose

    మలయాళీ ఇండస్ట్రీలో హనీ రోజ్ కి విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ శారీ లో మంచి సెక్సీ లుక్ లో మెస్మరైజ్ చేసింది. ఆమె నవ్వులకి ముత్యాలు రాలుతాయా అన్న విధంగా అందం, అదిరిపోయే దేహ సౌందర్యంతో కట్టిపడేసింది.