Hema : బెంగళూరు రేవ్‌పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నటి హేమ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బెంగుళూరు అవుట్ కట్స్ లో ఉన్న ఓ వ్యాపారవేత్త ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలు పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. ఇదే క్రమంలో నటి హేమ పేరు తెరముందుకు వచ్చింది. ఈ రేవ్‌పార్టీలో నటి హేమా హాజరైందని బెంగళూరు పోలీసులు అంటుండగా.. హేమ మాత్రం ఆ పార్టీతో తనకు సంబంధం లేదని ఓ వీడియోను రిలీజ్ చేసింది. తను హైదరాబాద్ లో హైదరాబాద్‌లోనే ఉన్నానని , బిర్యానీ చేస్తున్నా అని కూడా హేమ సోమవారం ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో బెంగళూరు కమిషనర్ రంగంలోకి దిగి ఈ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీల లిస్టును బయటపెట్టారు.
బెంగళూరు పోలీస్ కమిషనర్ ఇవాళ మీడియాతో మాట్లాడారు…”బెంగళూరు రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన ఓ నటి ఉంది. ఆమె నిన్న రిలీజ్ చేసిన వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ చేస్తున్నాం. ఈ రేవ్ పార్టీకి వచ్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. దాదాపు వంద మంది వరకు ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే పొలిటికల్ లీడర్స్ ఎవరూ ఇక్కడికి రాలేదు. ‘సన్ సెట్ టు సన్ రైస్ విక్టరీ’ పేరుతో ఈ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో పాల్గొన్న ఐదుగురిని అరెస్ట్ చేశాం”అని కమిషనర్ తెలిపారు.
నిన్న నటి హేమ రిలీజ్ చేసిన వీడియో కూడా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లోనిదే అరి సమాచారం. ఫామ్ హౌస్ గేటు దగ్గరి నుంచి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోయినట్లు పోలీసులు విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అయితే ఇవాళ హేమ బిర్యానీ చేస్తున్నట్లు మరో వీడియోను విడుదల చేసింది. నిన్న కూడా హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో చిల్ అయినట్లు తెలిపింది. బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో ఉన్నది తనకు కాదని చెప్పడం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.