Thu. Jan 22nd, 2026

    Health Tips: ప్రస్తుత కాలంలో అత్యధికంగా వేధిస్తున్న సమస్యలను అధిక బరువు సమస్య ప్రధానమైనది. మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా ఈ అధిక బరువు సమస్య వల్ల ఎక్కువ మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు సమస్య వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఈ అధిక బరువు సమస్య నుండి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డైట్ చేయటం జిమ్ కి వెళ్ళటం వంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొందరు బరువు తగ్గరు. అలాంటి వారికి అదిరిపోయే చిట్కా ఒకటి ఉంది. మన ఇంట్లో ఉండే అల్లం, కీర దోసకాయతో ఈ చిట్కా పాటిస్తే బాన పొట్టు కూడా కరిగిపోతుంది.

     

    కీరదోస, అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు అందటమే కాకుండా అధిక బరువు సమస్య నివారించడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయి. అల్లంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆయుర్వేదంలో కూడా అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే అధిక బరువు నివారణలో కూడా అల్లం ఎంతో మేలు చేస్తుంది. అల్లం ఉపయోగించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

    Health Tips….

    అలాగే కీరదోస కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అలాగే దీనిలో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడంలో కీరదోస సహాయపడుతుంది. అల్లం, కీరదోసతో మనం జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. జ్యూస్ తయారు చేయటానికి కీరదోషను ముక్కలుగా కోసి ఆ తర్వాత అందులో కొంచెం అల్లం వేసి నీరు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని ఒక గ్లాసులో వడపోసి అందులో కొంచం నిమ్మ రసం కలిపి తాగాలి. ఈ జ్యూస్ ని ప్రతిరోజు పరగడుపున తాగటం వల్ల అధిక బరువు సమస్య నుండి విముక్తి లభిస్తుంది.