Health Tips: ప్రతి వంటింట్లో ఉండే మసాలా దినుసులలో యాలకలు, లవంగాలు ఎంతో ముఖ్యమైనవి. యాలకులు, లవంగాలు వంటలో ఉపయోగించడం వలన వాటి రుచి మరియు సువాసన పెరగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిలో శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే యాలకులు లవంగాల కలిపి తినటం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
యాలకలు, లవంగాలను తినటం వల్ల తిన్న ఆహారం మొత్తం బాగా జీర్ణం అవుతుంది, తద్వారా గ్యాస్, అసిడిటీ సమస్య నుండి బయటపడడమే కాకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. లవంగాలు, యాలకులను తరచుగా కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి రక్తనాళాలు శుభ్రపరచడమే కాకుండా….. రక్తపోటు సమస్యల నుండి దూరం చేస్తుంది. అలాగే వీటిని కలిపి తీసుకుంటే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.
Health Tips:
రోజు ఉదయం అల్పాహారం చేసిన అరగంట తర్వాత మరియు రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత రెండు యాలకలు, ఒక లవంగన్ని నోట్లో వేసుకొని చప్పరించి నమిలి మింగాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, త్వరగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. యాలకలు, లవంగాలను ఇలా తీసుకోవడం వల్ల పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా పురుషులలో వీర్య కణాలు వృద్ది పెరుగుతుంది. లైంగిక సమస్యలు తగ్గిపోతాయి.