Wed. Jan 21st, 2026

    weight loss: ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. స్త్రీ పురుషులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే బరువు తగ్గడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జిమ్ కి వెళ్లడం, వాకింగ్ చేయడం, డైట్ ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంచెం కూడా బరువు తగ్గదు. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గాలి అనుకుంటున్నారా. రాత్రి సమయంలో కొన్ని రకాల చిట్కాలను ఫాలో అయితే చాలు ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మరి బరువు తగ్గాలంటే రాత్రి సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మ‌నం ప్ర‌తిరోజు రాత్రి స‌మ‌యంలో భోజ‌నం 8 గంట‌లలోపే భుజించ‌డం చాలా మంచిది.

    health-tips-of-reducing-weight-loss-at-night-time
    health-tips-of-reducing-weight-loss-at-night-time

    8 గంట‌ల త‌ర్వాత భోజ‌నం చేస్తే మ‌నం తిన్న ఆహ‌రం స‌రిగా జీర్ణం కాదు. ఫ‌లితంగా ఇది కొవ్వు గా మారి అధిక బ‌రువు పెరుగడానికి దోహ‌ద‌ప‌డుతుంది. కాబట్టి రాత్రి స‌మ‌యంలో వీలైనంత వ‌ర‌కు భోజ‌నంను 8 గంట‌ల లోపే చేస్తే బ‌రువు పెరిగే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అంతే కాకుండా త్వ‌ర‌గా టైమ్ కి ఆహ‌రం తిన‌డం వ‌ల‌న మంచిగా జీర్ణం అవుతుంది. రాత్రి భోజ‌నంతో పాటు కొంతమంది నంజుకోవడానికి కొన్నిసార్లు ర‌కాల చిప్స్ కూడా తింటారు. ఇలా తిన‌వ‌ద్దు దిని వ‌ల‌న కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. అయితే వాటికి బ‌దులు పండ్లు తిన‌డం మంచిది. రాత్రి స‌మ‌యంలో అన్నంకు బ‌దులు చపాతి లేదా అప్పాహ‌రం తీసుకోవ‌డం మేలు. ఈ స‌మ‌యంలో ఎంత త‌క్కువ తింటే అంత‌ మంచిది.

    ఎందుకంటే ప‌గ‌లు తినే ఆహ‌రం కంటే రాత్రి స‌మ‌యంలో తినే ఆహ‌రం మ‌న శ‌రీరంకు ఎక్కువ‌గా ప‌డుతుంది. రాత్రి స‌మ‌యంలో చాలా మంది మ‌ద్యం సేవించ‌డం స‌హ‌జ‌మే. కానీ దానివ‌ల్ల శ‌రిరంకు ఇబ్బంది క‌లుగుతుంది. శ‌రీరంలో ఉన్న మ‌ద్యాన్ని బ‌య‌ట‌కు పంపేందుకు చాలా ఇబ్బంది ప‌డుతుంది. దీంతో శ‌రిరం ఇత‌ర క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించ‌లేదు. రోజు రాత్రి పూట నింద్రించే ముందు పెప్ప‌ర్ మింట్ టీ లేదా దాల్చించెక్క డీకాష‌న్ తాగాలి. వీటి వ‌ల‌న శ‌రిర మెట‌బాలిజం పెరుగుతుంది. మ‌నం నిద్రించేట‌ప్పుడు కూడా క్యాల‌రిలు ఖ‌ర్చ‌వ‌తాయి. కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. రాత్రి స‌మ‌యంలో చాలా మంది మ‌ద్యం సేవించ‌డం స‌హ‌జ‌మే. కానీ దీని వల్ల శ‌రీరంకు ఇబ్బంది క‌లుగుతుంది. శ‌రీరంలో ఉన్న మ‌ద్యాన్ని బ‌య‌ట‌కు పంపేందుకు చాలా ఇబ్బంది ప‌డుతుంది. దీంతో శ‌రిరం ఇత‌ర క్రియ‌ల‌ను నిర్వ‌ర్తించ‌లేదు. కావున బ‌రువు త‌గ్గే ప్ర‌క్రియ‌కు ఆటంకం ఏర్ప‌డుతుందీ. అయితే రాత్రి మ‌ద్యం సేవించ‌డం మానేస్తే బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు.