Health Tips: సాధారణంగా చాలామంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యతో బాధపడేవారు నలుగురిలో కలిసి స్వేచ్ఛగా మాట్లాడాలన్న ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే నోటి సమస్య నుంచి విముక్తి పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ బాధ నుంచి బయటపడరు. మరి నోటి దుర్వాసన రావడానికి గల కారణాలు ఏంటి.. నోటి దుర్వాసనతో బాధపడేవారు ఎలాంటి చిట్కాలను పాటించాలి అనే విషయానికి వస్తే..
నోటి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం సరిగా బ్రష్ చేయకపోవడం ప్రధాన కారణం అని చెప్పవచ్చు.అలా కాకుండా మరి కొందరిలో డయాబెటిస్, జీర్ణ కోశ వ్యాధులు, శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారిలో కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువ కనుక నోటి దుర్వాసన విషయంలో అశ్రద్ధ వహించడం మంచిది కాదు. ఇలా నోటి దుర్వాసనతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకునే ముందు కచ్చితంగా బ్రష్ చేసుకోవడం మర్చిపోవద్దు.చిగుళ్ల ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్న పసుపు, ఉప్పు మిశ్రమం కలిపిన నీళ్లతో నోటిని శుభ్రం చేసుకోవాలి.నోరు, గొంతు, నాలుక పొడి బారిన నోటి దుర్వాసన వస్తుంది కనుక ప్రతి రెండు గంటలకు ఒకసారి తప్పనిసరిగా గ్లాసు మంచినీళ్లు తాగడం మంచిది.
Health Tips:
ఇక మన ఆహార పదార్థంలో ఎక్కువగా విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో మంచిది. భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా నోరు పుక్కిలించడం కూడా ఎంతో అవసరం. మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె మిశ్రమాన్ని మెత్తని పేస్టులా చేసి ప్రతిరోజు పళ్లు తోమితే చిగుళ్ల సమస్యలు తొలగి నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.అత్యవసర సమయాల్లో నోటి దుర్వాసన పోగొట్టే మెంథాల్ ఔషధ గుణాలు కలిగిన మౌత్ వాష్, చూయింగ్ గమ్ వాడవచ్చు. ముఖ్యంగా పొగ తాగడం ఆల్కహాల్ తాగడం మానుకోవాలి.