Health Tips: ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు కారణంగా వారి సొంత పనులు కూడా వారు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో చిన్న చిన్న విషయాలకే పక్కవారిపై ఆధారపడుతూ ఉంటారు. అయితే అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే జిమ్ కి వెళ్లడం వాకింగ్లో చేయడం ఎక్సర్సైజులు చేయడం డైట్ ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని చేసినా కూడా ఫలితం లభించగా దిగులు చెందుతూ ఉంటారు.
అయితే ఇక మీదట బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా అధిక బరువు సమస్యతో బాధపడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాను పాటిస్తే చాలు. ఈజీగా బరువు తగ్గుతారు.. మరి ఇందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. బరువు తగ్గడానికి కావాల్సిన పదార్థాలు అవిస గింజలు, జీల కర్ర, కరివేపాకు. ఈ మూడింటిని తీసుకోవాలి. మొదట కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రను తీసుకుని దానిని స్టవ్ పై పెట్టి అది కొద్దిగా వేడి కాగానే ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా అవిసె గింజలు, నాలుగైదు రెబ్బల కరివేపాకులు తీసుకుని పాత్రలో బాగా వేయించాలి. పొడి పొడిగా అయిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
ప్రతి రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ పొడిని కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోతుంది. అలాగే బరువు తగ్గడం మొదలవుతుంది. ఈ చిట్కాలో అవిసె గింజలు జీవక్రియ రేటు అలాగే జీర్ణ క్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి కేలరీలను వేగంగా బర్న్ చేయడానికి ఇది పని చేస్తుంది. అవిసె గింజలు ఫైబర్ ను పుష్కలంగా అందిస్తుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల మనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. జీలకర్ర జీర్ణక్రియను సహాయపడి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. జీరా నీరు జీర్ణ క్రియకు సాయపపడుతుంది. అలాగే ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. కొవ్వు బర్నింగ్ ప్రక్రియను జీలకర్ర వేగవంతం చేస్తుంది. ఇది అధిక ఆకలిని కంట్రోల్ చేస్తుంది.