Health Tips: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉంది అయితే ఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఉల్లిలో కన్నా ఉల్లికాడలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఉల్లికాడలను వివిధ రకాలుగా మనం మన ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి ఉల్లికాడలను ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే…
ఉల్లికాడల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్,సల్ఫర్ అధికంగా ఉంటుంది కావున తరచుగా ఆహారంలో చేర్చుకుంటే రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థను వేగవంతం చేస్తుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంచి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉల్లికాడల్లో ఉన్న విటమిన్ ఏ,కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా దృష్టిలోపాలను కూడా సవరిస్తుంది. ఉల్లికాడల్లో ఎక్కువగా లభించే ఫైబర్, పెక్టిన్ అనే పదార్థం పెద్ద పేగుల్లోని సున్నితమైన పొరలను రక్షించి పేగు కదలికలను మెరుగు పరుస్తుంది.
ఉల్లికాడలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధక సమస్య నుంచి బయటపడేటమే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. తద్వారా ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు కూడా ఉండవు. పిల్లలు తరచూ జలుబు,దగ్గు, ముక్కు కారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడలతో సూప్ తయారు చేసుకొని తింటే వీటిలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు అలర్జీలను తగ్గించి తక్షణ ఉపశమనం లభిస్తుంది. తీవ్రమైన మొలల సమస్యతో బాధపడేవారు ఉల్లికాడలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెరుగులో వేసుకొని తింటే మొలల వల్ల కలిగే నొప్పి తీవ్రత తగ్గుతుంది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.