Vastu Tips: సాధారణంగా మన జీవితంలో మనం తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలో పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. అలా పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకుంటూ పోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మనం చేసే ప్రతి పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రం ప్రకారం చేతుల నుంచి కొన్ని వస్తువులు జారి పడిపోవడం అశుభకరమైనదిగా భావిస్తారు. ఏ వస్తువులు మన చేతి నుండి జారిపోతే అశుభంగా భావిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి ఇంట్లో ఉప్పు కచ్చితంగా ఉంటుంది. ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల గృహప్రవేశం చేసేటప్పుడు మొదటగా ఉప్పుని ఇంట్లోకి తీసుకువెళ్తారు. అయితే కొన్ని సందర్భాలలో పొరపాటున చేయి జారి ఉప్పు కింద పడిపోతుంది. అల ఉప్పు పడిపోతే రాబోయే కొద్ది రోజుల్లో డబ్బు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది. పొరపాటున చేతి నుంచి పాలు కింద ఒలకడం కూడా మంచిది కాదు. చేతిలో నుంచి పాలు పడితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం బియ్యం, గోధుమ వంటి ధాన్యాలు చేయి జారి కిందపడటం కూడా ఆశుభంగా భావించవచ్చు. ఒకరి చేతి నుంచి ధాన్యం కిందపడితే అన్నపూర్ణ తల్లికి అవమానంగా పరిగణించాలి.నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పొరపాటున ఇవి చేయి జారీ కింద పడిపోవడం అంటే కుటుంబసభ్యులు రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. పూజా ఫలకం పడిపోవడం కూడా మంచి శకునం కాదని పురాణాల్లో పేర్కొన్నారు. ఇది కుటుంబంలో పెద్ద సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉంటుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.