Health Tips: సాధారణంగా ప్రతి ఒక్కరికి భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయడం చాలా అలవాటుగా ఉంటుంది కొందరు తిన్న వెంటనే నిద్ర పోవడం మరికొందరు తిన్న వెంటనే సిగరెట్ కాల్చడం మరికొందరు పాన్ వేసుకోవడం వంటి అలవాట్లు ఉంటాయి. అలాగే మరికొందరు తిన్న తర్వాత కాసేపు అలా నడుస్తూ అనంతరం నిద్రపోతూ ఉంటారు.ఇలా భోజనం చేసిన తర్వాత మనం కొన్ని రకాల పనులు అసలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పనులు కనక చేస్తే తప్పనిసరిగా మనం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి తిన్న వెంటనే ఎలాంటి పనులు చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే…
చాలామందికి భోజనం చేసిన వెంటనే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది అయితే ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగటం వల్ల మన శరీరంలో అధిక మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది.ఇక చాలామందికి భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. భోజనం చేసిన తర్వాత ఇలా ఒక సిగరెట్ తాగిన అది పది సిగరెట్లతో సమానమని దాంతో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది.ఇక చాలామంది భోజనం చేసిన వెంటనే అక్కడే కూర్చుని ఇతరత పండ్లను కూడా తింటూ ఉంటారు ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు.
Health Tips:
భోజనం చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు విరామం ఇచ్చిన తర్వాత పండ్లు తినడం మంచిది.ఇక చాలామంది భోజనం చేసిన వెంటనే స్నానానికి వెళ్తారు ఇలా చేయటం వల్ల ఒక్కసారిగా మన శరీరం మొత్తం చల్లబడి ఆహారం జీర్ణం కావడానికి ఇబ్బంది పడుతోంది. తద్వారా జీర్ణ క్రియ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక తిన్న వెంటనే నిద్ర కూడా మంచిది కాదు.నిద్రపోవడం వల్ల గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.