Health Tips: సాధారణంగా ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ చాయ్ తాగనిదే వారి రోజువారి పనులను ప్రారంభించడానికి ఇష్టపడరు. ఇలా ప్రతి రోజూ ఉదయం సాయంత్రం టీ తాగుతూ ఉంటారు.అయితే టీ ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. టీ బాగా తాగేవారు సాయంత్రం సమయంలో కనుక టీ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి సాయంత్రం టీ గనుక అధికంగా తాగడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
టీలో మనకు ఎన్నో రకాలు ఉంటాయి అయితే మనం సాయంత్రం పూట పాలతో తయారు చేసిన టీ తాగటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి పడుకోవడానికి పది గంటల ముందు కెఫిన్ తీసుకోవడం ఎంతో ఉత్తమం. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు అలాగే ఒత్తిడి అధికంగా ఉన్నటువంటి వారు సాయంత్రం పూట తీసుకోవడం మంచిది కాదు.
Health Tips
ఇది కాకుండా, బరువు పెరగాలనుకునే వారు, గ్యాస్‌తో బాధపడే రోగులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు, ఆరోగ్యకరమైన చర్మం గురించి ఆందోళన చెందుతున్న వారు సాయంత్రం పూట టీ తాగకపోవడమే ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా సాయంత్రం పాలతో తయారు చేసిన టీ తాగడానికి బదులు ఏవైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇక టీ లేనిదే రోజు గడవదు అనుకుంటే కనుక రోజుకు ఒక కప్పు టీ తాగడం మంచిదని అంతకుమించి తాగటం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.