Thulasi Plant: మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు అయితే తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తారు. ఈ విధంగా లక్ష్మీ కటాక్షం కలగడం కోసం తులసి మొక్కకు పూజ చేసే సమయంలో చాలామంది నీటిని లేదా పాలను సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు.
ఈ విధంగా తులసి మొక్కకు పాలు లేదా నీళ్లు కాకుండా చెరుకు రసం సమర్పిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి తులసి మొక్కకు చెరుకు రసం సమర్పించే సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించడం ఎంతో ఉత్తమం. ఉదయాన్నే తల స్నానం చేసిన అనంతరం తులసి మొక్కకు చెరుకు రసాన్ని సమర్పించాలి. అయితే చెరుకు రసం సమర్పించే సమయంలో ప్రతి ఒక్కరు కూడా తమ గోత్రనామాలను పేర్లను ఏడుసార్లు చదువుకొని తులసి మొక్కకు చెరుకు రసం సమర్పించడం ఎంతో అవసరం.
Thulasi Plant:
ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపైనే ఉంటాయి అంతేకాకుండా సాయంత్రం ఉదయం తప్పనిసరిగా తులసి మొక్కకు దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అంతేకాకుండా తులసి మొక్క వేర్లను తాయత్తులో పెట్టి మెడలో వేసుకోవటం వల్ల ఎన్నో శుభ పరిణామాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇలా తులసి మొక్కకు చెరుకు రసాన్ని సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.