Health: క్యారట్ అనేది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడే సహజ వస్తువు. విటమిన్ A, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే క్యారట్ చర్మం నిగారింపు, ప్రకాశం, మెత్తదనం కోసం గొప్ప పరిష్కారంగా నిలుస్తుంది. చర్మంపై మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే తేమ శాతం సమర్థంగా ఉండాలి. క్యారట్ జ్యూస్ చర్మానికి తేమను అందించడంలో తోడ్పడుతుంది. మేకప్‌కి ముందు ఒక టేబుల్‌స్పూన్ క్యారట్ రసం, ఒక టేబుల్‌స్పూన్ కమలారసం మిక్స్ చేసి ముఖంపై 10 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగితే తక్షణ ఫ్రెష్‌నెస్ తో పాటు మేకప్ స్టే కూడా మెరుగవుతుంది.
పిగ్మెంటేషన్ తగ్గించేందుకు క్యారట్ ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
క్యారట్ జ్యూస్ – 2 టేబుల్‌స్పూన్లు
ఓట్స్ పౌడర్ – 1 టేబుల్‌స్పూన్
పసుపు – కొద్దిగా
చక్కెర – 1 టేబుల్‌స్పూన్
క్యారట్‌ను గ్రైండ్ చేసి రసం తీయాలి. దానిలో ఓట్స్ పౌడర్ జత చేసి పేస్ట్‌లా కలపాలి. తరువాత పసుపు, పంచదార జత చేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మృదువుగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
పసుపు చర్మం టోన్‌ను మెరుగుపరచుతుంది. క్యారట్ జ్యూస్ చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. చక్కెర, ఓట్స్ స్క్రబ్‌లా పనిచేస్తూ మృత కణాలను తొలగిస్తాయి.
ఇలాగే సప్తాహానికి రెండు సార్లు ఈ ప్యాక్ వాడితే, మీ చర్మం సహజంగా ప్రకాశవంతంగా మారుతుంది. ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు, ఇంట్లో తయారుచేసే ఈ ప్యాక్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేచురల్ బ్యూటీ కోసం క్యారట్ మీకు మంచి మిత్రం!
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.