Pomogranate: సాధారణంగా మనం ప్రతిరోజు వివిధ రకాల పండ్లు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అయితే కొన్ని రకాల పండ్లు కొన్ని సమస్యలతో బాధపడేవారు తినక పోవడమే మంచిది. ఇలా కొన్ని సమస్యలతో బాధపడేవారు కొన్ని పనులను తినడం వల్ల సమస్య తీవ్రత మరింత అధికమవుతుంది. ఇక పండ్లలో దానిమ్మ పండు ఎన్నో పోషక విలువలను కలిగి ఉన్నదని మనకు తెలిసిందే. దానిమ్మ పండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ముఖ్యంగా రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు దానిమ్మ పండు లేదా దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు.
Pomogranate: దానిమ్మ పండును తీసుకోవడం వల్ల వారి సమస్య తీవ్రతరం అవుతుంది.
ఇలా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి దానిమ్మ పండును తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండును తీసుకోవడం వల్ల వారి సమస్య తీవ్రతరం అవుతుంది. మరి ఎలాంటి వారు ఈ దానిమ్మ పండుకు దూరంగా ఉండాలి అనే విషయానికి వస్తే… తరచూ దగ్గు సమస్యతో బాధపడేవారు దానిమ్మ పండుకు పూర్తిగా దూరంగా ఉండాలి ఇలా దగ్గుతో బాధపడేవారు దానిమ్మ పండ్లను తినడం వల్ల ఆ సమస్య మరింత అధికమవుతుంది.
ఆస్తమా, ఎసిడిటీ, లో బిపి వంటి సమస్యలతో బాధపడే వారు కూడా వీలైనంతవరకు దానిమ్మ పండుకు దూరంగా ఉండాలి. ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడే వారికి దానిమ్మ పండు అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండులో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నప్పటికీ ఈ దగ్గు ఆస్తమా ఎసిడిటీ లో బీపీ వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది అంత ప్రయోజనకరం కాదు కనుక ఈ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ తినక పోవడమే ఎంతో మంచిది.