Life Style: మన ఆరోగ్యానికి పోషక విలువలు ఎంతో అవసరమని సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పోషక విలువలో మనకు బెల్లం అలాగే పెరుగులో ఎక్కువగా లభిస్తాయని తెలుసు వీటిని తీసుకోవటం వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు అయితే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా తీసుకుంటే ఏం జరుగుతుంది అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది.
ఈ విధంగా పెరుగు బెల్లం కలిపి తీసుకోవటం ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. బెల్లం పెరుగులో అధిక పోషక విలువలు ఉండటం వల్ల ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఆ ప్రయోజనాలు అన్నింటిని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. పెరుగులో ఉండే కాల్షియం, ఫాస్పరస్.. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇంతకీ పెరుగు, బెల్లంను కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పెరుగు, బెల్లం బెస్ట్ ఆప్షన్‌గా చెపొచ్చు. పెరుగు, బెల్లం రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎప్పుడైతే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తరచూ కాస్త బెల్లం ముక్క తినటం వల్ల ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు . ఎవరైతే శరీర బరువు తగ్గాలని అనుకుంటున్నారో అలాంటి వారికి కూడా ఈ పెరుగు బెల్లం మంచి ఆప్షన్ అనే చెప్పాలి ఇక తరచూ వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.