Health Benefits: సాధారణంగా మనం కూరగాయలతో పాటు మాంసాహారం తినడానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాము అయితే మాంసాహారం చాలామంది వారంలో ఒకసారి లేదంటే నెలలో రెండు మూడు సార్లు తింటూ ఉంటారు. మరి కొంతమంది తరచూ వారికి మాంసం లేనిదే అన్నం తినడానికి కూడా ఇష్టం ఉండదు. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం బోటి ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా పొట్టేలు లేదా మేక బోటి (ప్రేగులు) తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి తింటూ ఉంటారు.
మరి ఇలా తరచూ బోటి తినడం ఆరోగ్యానికి మంచిదేనా ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే.. బోటిలో ఎక్కువగా ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ మరియు కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.కోలిన్ యొక్క మంచి మూలం..ఇది మెదడు పనితీరు మరియు పనితీరును నిర్వహించడానికి ముఖ్యమైన పోషకంగా పరిగణించబడుతుంది.. అంతేకాకుండా, మేక ప్రేగులలో క్రియేటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
1/2 కప్పు మేక ప్రేగులలో 1.57 mg విటమిన్ B12 ఉంటుంది. ఇందులో రోజువారీ తీసుకోవడంలో 65 శాతం ఉంటుంది. విటమిన్ B12 ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, కళ్ళు, కాలేయం మొదలైన వాటిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా కణజాల పనితీరుకు డిఎన్ఏ ఉత్పత్తికి కూడా ఈ బోటి అనేది ఎంతగానో దోహదం చేస్తుంది. కనుక కనీసం నెలలో రెండు మూడు సార్లు ఆయన బోటీ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.