Drinking Water: మనలో చాలామందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు. కొందరు గోరువెచ్చని నీరు తాగితే మరి కొందరు నార్మల్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇది చాలా మంచి గొప్ప అలవాటు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే మంచినీళ్లు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కొలువుతాయి. ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే పాచి ముఖంతో అనగా బ్రష్ చేసుకోక ముందు తాగడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కానీ అలా కాకుండా చాలామంది లేచిన తర్వాత గంట రెండు గంటలకు లేదంటే బ్రష్ చేసుకున్న తర్వాత తాగుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు.
ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత కడుపు నిండియా వరకు నీళ్లు తాగాలి. ఉదయాన్నే లేవగానే నిత్యం ఒక లీటర్ నీళ్లు తాగితే ఒక వంద రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. ముందు శరీరంలోని విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. అయితే మంచినీళ్లు తాగగానే వెంటనే వ్యాయామం చేయడం, నడవడం, పరిగెత్తడం లాంటివి చేయకూడదు. కావాలంటే మంచినీళ్లు తాగిన ఒక 10 నిమిషాల తర్వాత వ్యాయామం చేయవచ్చు. కచ్చితంగా ఒక లీటర్ నీటిని తాగాలా అంటే అలా అని ఎవరు చెప్పలేదు. మీ అనుకూలం బట్టి మీరు ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు లేదా లీటర్ నీటిని తాగవచ్చు. పరగడుపున మంచి నీళ్లను తాగితే పేగులు శుభ్రం అవుతాయి.
మలబద్ధకం సమస్య రాదు. ఫ్రీగా మోషన్ అవుతుంది. కిడ్నీలు శుభ్రం అవుతాయి. కాలేయం కూడా శుభ్రపడుతుంది. అలాగే జీర్ణాశయం కూడా శక్తిమంతంగా తయారవుతుంది. తాగే నీళ్లు కాస్త గోరు వెచ్చగా ఉంటే బరువు కూడా తగ్గొచ్చు. చాలామంది ఈ రోజుల్లో మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు ఈ విధంగా తరచూ చేయడం వల్ల మలబద్ధకం సమస్య దరిచేరదు. అంతేకాకుండా మోషన్ కూడా బాగా ఫ్రీగా అవుతుంది.