Health Benefits: సాధారణంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందువల్ల వేసవికాలంలో లభించే కొన్ని ప్రత్యేకమైన పండ్లు తీసుకోవడం వల్ల వేసవి ఉష్ణోగ్రతల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలా వేసే కాలంలో లభించే ప్రత్యేకమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. వేసవి కాలంలో లభించే ఈ తాటి ముంజలు శరీరానికి చలవనిస్తాయి. ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ తాటి ముంజలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తాటి ముంజల్లో విటమిన్ బీ-7, విటమిన్ కే, సోలెబుల్ ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-డీ, జింక్, ఐరన్‌లతో వంటి ఎన్నో పోషకాలు దాగివున్నాయి. అంతే కాకుండా వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల శరీరంలో రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా వీటిని తినటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగించి హానికర వ్యర్థ్య పదార్థాలను కూడా తొలగించి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతాయి.
వీటిని తినటం వల్ల ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.అలాగే వేసవిలో తాటిముంజల్ని రోజూ తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా తాటి ముంజలతో జీవిత సంబంధ వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చు. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు నివారణలో ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి.
తాటిముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.