Wed. Jan 21st, 2026

    Health Benefits: సాధారణంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అందువల్ల వేసవికాలంలో లభించే కొన్ని ప్రత్యేకమైన పండ్లు తీసుకోవడం వల్ల వేసవి ఉష్ణోగ్రతల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలా వేసే కాలంలో లభించే ప్రత్యేకమైన పండ్లలో తాటి ముంజలు కూడా ఒకటి. వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. వేసవి కాలంలో లభించే ఈ తాటి ముంజలు శరీరానికి చలవనిస్తాయి. ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్‌ బారినపడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ తాటి ముంజలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

     

     

    తాటి ముంజల్లో విటమిన్‌ బీ-7, విటమిన్‌ కే, సోలెబుల్‌ ఫైబర్‌, పొటాషియం, క్యాల్షియం, విటమిన్‌-ఏ, విటమిన్‌-సీ, విటమిన్‌-డీ, జింక్‌, ఐరన్‌లతో వంటి ఎన్నో పోషకాలు దాగివున్నాయి. అంతే కాకుండా వీటిలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల శరీరంలో రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా వీటిని తినటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగించి హానికర వ్యర్థ్య పదార్థాలను కూడా తొలగించి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతాయి.

    Health Benefits

    వీటిని తినటం వల్ల ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్‌ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.అలాగే వేసవిలో తాటిముంజల్ని రోజూ తీసుకోవడం ద్వారా లివర్‌ సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా తాటి ముంజలతో జీవిత సంబంధ వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చు. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలు నివారణలో ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి.

    తాటిముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది.