Headache: సాధారణంగా మనం ఏదైనా అధికంగా పనిచేస్తున్నప్పుడు లేదా కొన్ని ఆందోళనల కారణంగా మనకు తలనొప్పి రావడం సర్వసాధారణం.ఇలా తలనొప్పి రావడంతో చాలామంది తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం వెంటనే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు అయితే ఇలా తలనొప్పి వచ్చిన ప్రతిసారి టాబ్లెట్స్ వేసుకోవడం కన్నా సింపుల్ చిట్కాలతో తలనొప్పి సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
తలనొప్పి సమస్య తలెత్తినప్పుడు కాంతి తక్కువగా ఉండే గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెలుతురు ఎక్కవగా ఉన్నచోట పడుకోవడం వల్ల తలనొప్పి పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే తలనొప్పి సమస్య అధికంగా ఉన్నవారు గోరువెచ్చని పాలల్లో నిమ్మరసం కలుపుకొని సేవిస్తే తలనొప్పి సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. తలనొప్పిని తగ్గించడంలో యాకలిప్టస్ ఆయిల్ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. కావున తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు గాబారపడకుండా నుదిటిపై యాకలిప్టస్ ఆయిల్ తో సున్నితంగా మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Headache:
తలనొప్పిగా ఉన్నప్పుడు వెల్లుల్లితో కషాయం చేసుకొని ఒక టేబుల్ స్పూన్ సేవిస్తే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.అలాగే కాఫీ,టీ వంటి పానీయాలు మానసిక ఒత్తిడిని తగ్గించి మెదడు చురుకుదనాన్ని పెంచడంలో సహాయపడతాయి. కావున తలనొప్పిగా ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి కాఫీ, టీ నీ తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. రోజు ఇలా తలనొప్పి సమస్యతో బాధపడేవారు రోజువారి ఆహారంలో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం ,మెగ్నీషియం ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అరటిపండు తొక్కను ఒక పది నిమిషాలు పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి అనంతరం దానిని మన నోటిపై వేసుకోవడం వల్ల తొందరగా తలనొప్పి తగ్గుతుంది.