Summer Season: వేసవికాలం మొదలవడంతో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం పది గంటలు దాటితే ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలి అంటేనే భయంగా ఉంది బయట ఎండలు ఎక్కువగా కావడంతో చాలామంది బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఇక బయటకు వెళ్తే కనుక పెద్ద ఎత్తున చెమటలు పట్టడం మన బాడీ డీ హైడ్రేషన్ కి గురి కావడం జరుగుతుంది. ఇలాంటి హైడ్రేషన్ కి గురి కాకుండా ఉండాలి అంటే వేసవి కాలంలో చల్ల చల్లని పానీయాలు తీసుకోవడం తప్పనిసరి అయితే మనం తీసుకునే పానీయాలు మన శరీరానికి కోల్పోయినటువంటి పోషకాలను అందించేవిగా ఉండాలి.
ఇలా వేసవికాలం మొదలవడంతో ఎన్నో రకాల జ్యూసులు కూడా అందుబాటులోకి వస్తూ ఉంటాయి ముఖ్యంగా రోడ్డు పక్కన మనకు పెద్ద ఎత్తున కొబ్బరి బోండాలు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ప్రతిరోజు ఒక కొబ్బరి బొండం తాగటం వల్ల ఇందులో ఉన్నటువంటి పొటాషియంతో పాటు ఇతర పోషక విలువలు మన శరీరానికి శక్తిని అందించడమే కాకుండా మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది.
ఇక ఉదయమే కాస్త లెమన్ జ్యూస్ తాగటం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ జ్యూస్ తాగటం వల్ల ఎండ తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంపొందింప చేస్తుంది. వేసవిలో మనల్ని చల్లగా ఉంచడానికి కీరదోస కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కీరదోసను జ్యూస్ రూపంలో లేదా అలా పచ్చిగా అయినా కూడా తినడం మంచిది. వీటితోపాటు పుచ్చకాయ జ్యూస్ గ్రీన్ టీ పలుచని మజ్జిగను తరచు తాగుతూ ఉండటం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురికాకుండా ఉంటుంది.