Guru Purnima: ప్రతి ఏడాది ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. నేడు వేద వ్యాసుడు పుట్టినరోజు కావడంతో ఈరోజు వేద వ్యాసుడు జన్మించిన దినం కావడంతో ప్రతి ఒక్కరూ నేటిని గురు పౌర్ణమిగా ప్రజలందరూ జరుపుకుంటారు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. నేడు ప్రతి ఒక్కరు గురువులను పూజించి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం ఎంతో మంచిది. గురు పౌర్ణమిని ఎందుకు మనం జరుపుకుంటాము అనే విషయానికి వస్తే..
ఆదియోగి గురువైన మహా శివుడు ఆషాడ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతోంది. ఆషాఢ పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. అందుకే గురు పౌర్ణమి రోజు తమ గురువులను పూజించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.
Guru Purnima
ఇక ఈ గురు పౌర్ణమి రోజు ఎంతోమంది తమ ఇళ్లలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ పౌర్ణమి రోజు చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. అలాగే సాయిబాబా మందిరాలలో ప్రత్యేక పూజలు చేసి సాయిబాబాను దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి, వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది.