Wed. Jan 21st, 2026

    Guppedantha manasu serial: వసుధార ప్లాన్ ఏంటో అర్థం కాక కంగారు పడుతుంది జగతి. కొత్త దంపతులకు ఈ బట్టలు ఇచ్చి వ్రతం చేయించమని సూచిస్తుంది దేవయాని. ఇద్దరి మధ్య గొడవ పెట్టాలన్న దేవయాని ప్లాన్ అర్థమవుతుంది జగతికి. కానీ తప్పకు బట్టలు తీసుకుని వెళ్తుంది. ‘జగతి.. ఏంటిది’ అంటాడు మహింద్ర. ఇద్దరూ కలిసి ఏం చేయాలా అని ఆలోచిస్తారు. కానీ చివరికి అడుగు వెనకకు వేయకూడదని నిర్ణయించుకుంటుంది జగతి.

    కొత్త బట్టలు వసుకు ఇచ్చి జరిగింది చెప్తారు జగతి, మహింద్రలు. దానికి వసు షాకవుతుంది. రిషి సార్ ఒప్పుకోరని కుంగిపోతుంది. దాంతో వసుకు ధైర్యం నూరిపోస్తుంది జగతి. ఈ రకంగానైనా మీ మధ్య దూరం తగ్గుతుందేమో.. చూడు అంటూ సలహా ఇస్తుంది జగతి. దేవయాని వదిన గారు ఇచ్చారని రిషికి చెప్తే గౌరవంతో ఒప్పుకోవచ్చు.. అంటాడు మహింద్ర కూడా. రిషి ఒప్పుకుంటాడనే నమ్మకం నాకుందని భరోసా ఇస్తుంది జగతి.

    Guppedantha manasu serial: vasudhara is upset
    Guppedantha manasu serial: vasudhara is upset

    Guppedantha manasu serial:  సీన్ కట్ చేస్తే.. వసు దేవయాని ఇచ్చిన కొత్త బట్టలతో రిషి గదికి వెళ్తుంది. రిషి మాత్రం వ్రతంలో వసుతో కూర్చోవడానికి ఒప్పుకోడు. వసుతో ఆ విషయం గురించి వాదిస్తాడు. అక్కడ వ్రతానికి కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. అందరూ రిషిధారల కోసం ఎదురుచూస్తారు. ఏం జరిగిందోనని కంగారు పడతారు జగతి, మహింద్రలు. దేవయాని మాత్రం లోలోపల పొంగిపోతుంది. అపుడే పూజారి పూజకు సమయం ఆసన్నమైందని దంపతుల్ని పిలవమని అంటాడు. ధరణిని వెళ్లి చూసి రమ్మంటుంది దేవయాని.

    అంతలోనే దేవయానికి దిమ్మతిరిగే షాక్ తగులుతుంది. రిషిధారలు కొత్త బట్టలతో వస్తుంటారు. వాళ్లని చూసి జగతి, మహింద్రలు ఆనందంతో ఉప్పొంగిపోతారు. దేవయాని ఇద్దర్నీ పీటల మీద కూర్చోమని చెప్తుంది. మేం కూర్చోమని అంటాడు రిషి. ‘డాడ్.. మీరు మేడం కూర్చోండి’ అంటాడు. ఇదేంటి రిషి అని అడగ్గా తర్వాత మాట్లాడుకుందాం పెద్దమ్మా అంటాడు. దానికి ఫణింద్ర కూడా ఓకే అంటాడు.

    సీన్ కట్ చేస్తే.. మహింద్ర, జగతిలు పీటల మీద కూర్చుంటారు. పంతులు పూజ మొదలుపెడతాడు. దేవయాని మాత్రం అయోమయంలో మునిగిపోతుంది. ఆ తర్వాత గదిలో రిషిధారల మధ్య జరిగింది చెప్తారు. ‘ప్రేమకు ఎవరూ అవసరం లేదు కానీ.. పెళ్లికి రెండు కుటుంబాలు అవసరం. నువ్ ఒకటి నమ్మావ్. నీమీద ప్రేమతో నేను నమ్మాను’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడతాడు రిషి. ఎంతమందిని ఇలా నమ్మిస్తాం.. చివరకు దేవుడి పూజలో కూడా అయితే ఎలా అంటాడు రిషి. ఈ బట్టలు దేవయాని మేడం పంపించిందని వసు చెప్పగా.. నేను పెద్దమ్మతో చెప్తాను ఈ పూజ మనం చేయట్లేదంటాడు రిషి. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.