Wed. Jan 21st, 2026

    Guppedantha manasu serial: వసు కుటుంబసభ్యురాలిగా రిషి ఇంటికి వెళ్లి గెస్ట్ రూంలో ఉంటుంది. ధరణి వసుకు వెల్‌కం చెప్పి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత రిషి నిద్రలో నుంచి లేస్తాడు. వసు ఒక్క మెసేజ్ కూడా చేయలేదేంటని అనుకుంటాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన రిషికి వసు తులసి కోటకు మొక్కుతూ కనిపిస్తుంది. ఇదే నిజమా లేక నా ఊహనా అనుకుంటూ వసుకు ఫోన్ చేస్తాడు. నిజమేనని తెలిసి ఆశ్యర్యపోతాడు.

    వసుధార ఇంత పొద్దున్నే వచ్చిదేంటి అని మనసులో అనుకుంటాడు. దగ్గరికెళ్లి నువ్ ఇక్కడికి వచ్చావేంటి అంటాడు వసుతో. నేను ఇక్కడికే వచ్చాను అంటుంది వసు. అంతలోనే దేవయాని వచ్చి వసు, చక్రపాణి మీద లేనిపోనివన్నీ నూరిపోస్తుంది రిషికి. దీనికి జగతి, మహింద్రలు కూడా సపోర్ట్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తుంది. వసు మాట్లాడకుండా తడబడుతుంటే.. కం టు మై రూం అని వసుని పిలుస్తాడు రిషి. దాంతో దేవయానికి దిమ్మ తిరిగిపోతుంది.

    Guppedantha manasu serial: vasudhara gets applauded
    Guppedantha manasu serial: vasudhara gets applauded

    కాఫీ తీసుకుని రిషి గదికి వెళ్తుంది వసు. చెప్పాపెట్టకుండా లగేజ్‌తో రావడమేంటని ప్రశ్నిస్తాడు. నాకు కనీసం మెసేజ్ అయినా చేయొచ్చు కదా అని అరుస్తాడు. అసలు నువ్ ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా వసుధార అని నిలదీస్తాడు రిషి. అలా వసు మీద కోపంతో ఊగిపోతాడు రిషి. నా మైండ్ పనిచేయట్లేదు.. నేను ఆలోచించుకోవాలని వసుని పంపించేస్తాడు.

    సీన్ కట్ చేస్తే.. వసు గురించి జగతిని ప్రశ్నిస్తాడు రిషి. ఈ విషయంలో నాకేం మాట్లాడాలో తెలియదని అంటుంది జగతి. అందరిముందు నేను అన్నదాన్ని నువ్ ఒప్పుకున్నావ్ కదా అంటుంది. ఒప్పుకుంటే నిజం అయిపోతుందా అంటాడు రిషి కోపంతో. అంతలోనే జగతికి వసు కాల్ చేస్తుంది. ‘మేడం ఎక్కడున్నారు’ అని అడుగుతుంది. మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి రండి మేడం అని పిలుస్తుంది జగతిని.

    ఇంట్లో కాలేజి విషయాలు చర్చించుకోవడం చాలా హ్యాపీగా ఉందంటారు ఫణింద్ర, మహింద్రలు. జగతి కూడా వచ్చి అందులో జాయిన్ అవుతుంది. ఆ తర్వాత మిషన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఆలోచనల్ని వసు అందరికి చెప్తుంది. తనని అభినందిస్తూ చప్పట్లు కొడతారు. అపుడే రిషి వస్తాడు. మరి నన్నెందుకు పిలవలేదో అంటాడు రిషి. ప్రతి చిన్నదానికి ఎండీని పిలవడమెందుకుని అనుకున్నానని చెప్తుంది వసు. మరి కాలేజిలో జరిగే ప్రతి చిన్న మీటింగ్‌కి నన్నెందుకు పిలుస్తున్నారో అంటాడు రిషి.

    అది కాలేజి. అందరి టైం వేస్ట్ చేయలేం కదా అంటుంది వసు. వర్క్ మాది నిర్ణయం మీది అని సమర్థించుకుంటుంది వసుధార. ఆ తర్వాత రిషిధారల మద్య టాపిక్ కాస్త డైవర్ట్ అవుతుందని మహింద్ర అనుకుంటాడు. ఆ తర్వాత రిషి, ఫణింద్రలు వెళ్లిపోతారు. జగతి, మహింద్రలు నవ్వుకుంటారు. వాళ్లకి ఆత్మభిమానం ఎక్కువ అని అంటుంది జగతి. వాళ్ల మధ్య దూరాన్ని వాళ్లే తగ్గించుకుంటారని మహింద్రకు చెప్తుంది జగతి. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.