Wed. Jan 21st, 2026

    Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో వసు రిషికి మిషన్ ఎడ్యుకేషన్ గురించి వివరిస్తుంది. ఆ తర్వాత జగతి, మహింద్రలు చక్రపాణి దగ్గరకు వెళ్లి రిషిధారలు కలవాలంటే వాళ్లిద్దరిని ఒకేచోట ఉంచాలి దానికి మీరు సహకరించాలని అడుగుతారు. చక్రపాణి కూడా ఓకే చెప్తాడు. ఆ తర్వాత తమ ప్లాన్ గురించి మహింద్ర కొడుకుతో చెప్తాడు. రిషి ఓకే అనడంతో ఆనందంతో గెంతులు వేస్తారు జగతి, మహింద్ర. ఆ తర్వాత నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం….

    రిషి రావడం చూసి యాక్షన్ స్టార్ట్ చేస్తాడు మహింద్ర. రిషి చూసి ఏంటి డాడి కాఫీ తాగి వెళ్లొచ్చు కదా అంటాడు. కొడుకు మాట కాదనలేక సరే అంటాడు. రిషి వదినా మూడు కాఫీలు అని చెప్పగా ధరణి తీసుకొచ్చి ఇస్తుంది. కాఫీ తాగుతుండగా ప్రాజెక్ట్ టూర్‌ని సక్సెస్ చేసి రండి డాడీ అంటాడు రిషి. వెళ్దామా అని జగతి అనగానే కడుపునొప్పి అంటూ అరుస్తాడు మహింద్ర. ఏమైంది అంటూ అందరూ కంగారు పడతాడు. అయినా వెళ్దాం పద అంటాడు మహింద్ర. మీరెవరు వెళ్లాల్సిన అవసరం లేదు నేను వెళ్తాను అంటాడు రిషి. సారీ రిషి నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అంటాడు తండ్రి. వస్తాను డాడ్ అంటూ బయల్దేరతాడు రిషి.

    Guppedantha manasu serial: vasu and rishi spend a time together
    Guppedantha manasu serial: vasu and rishi spend a time together

    Guppedantha manasu serial: సీన్ కట్ చేస్తే.. కాలేజిలో వసుధార కిట్‌లను ఒక దగ్గర పెట్టిస్తుంది. జగతి మేడం ఇంకా రాలేదేంటని ఎదురుచూస్తుంది. అక్కడ మహింద్ర మన నటన ఎలా ఉందంటూ సరదాగా నవ్విస్తాడు జగతిని. అపుడే ధరణి వచ్చి మహింద్రకు కషాయం ఇస్తుంది. ఇప్పుడు నేను వసుధారతో ప్రయాణం చేయాలా అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటూ కారులో వెళ్తాడు రిషి. ఇపుడైనా వసు ఎవర్ని పెళ్లి చేసుకుందో తెలుస్తుందా? అనుకుంటాడు మనసులో. అపుడే వసు జగతికి కాల్ చేస్తుంది. కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మహింద్రకు ఫోన్ చేస్తుంది వసు. ఇద్దరూ లిఫ్ట్ చేయకపోవడంతో మెసేజ్ పెడుతుంది. మెసేజ్‌కు రిప్లై రాకపోవడంతో రిషికి కాల్ చేస్తుంది వసు. రిషి కాల్ కట్ చేసి డైరెక్ట్‌గా వెళ్తాడు వసు దగ్గరికి. మేడం వాళ్లు రావట్లేదని చెప్పడంతో వసు షాకవుతుంది. ఇద్దరూ కలిసి కిట్స్ ఇవ్వడానికి కారులో బయల్దేరతారు. ఎన్నాళ్లు నిజం దాచిపెడతాడు వసుధార అంటాడు రిషి. దాగినన్ని రోజులు అంటుంది వసు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తారు.

    వసు ప్లాస్క్‌లోని కాఫీ కప్‌లో పోస్తుంటే కావాలని కారుని ర్యాష్‌గా డ్రైవ్ చేస్తాడు రిషి. ఆ తర్వాత పక్కన కారు ఆపి ఇపుడు తాగు అంటాడు. సీట్ బెల్ట్ తీయండి సర్ అని వసు అడగ్గా.. తన చేతిలో ఉన్న ప్లాస్క్ తీసుకుని నువే తీసుకో అంటాడు రిషి. అది విని లోలోపల నవ్వుకుంటుంది వసు. తర్వాత కారు దిగి వచ్చి రిషికి కాఫీ ఇస్తుంది. మరి టూర్‌ని రిషిధారలు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలి.