Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసి ఇప్పటికే మహేశ్ బాబు లుక్స్ కూడా వదిలారు. మాస్ ఆడియన్స్ లో వీటికి విపరీతమైన ఆధరణ లభించింది. ఇందులో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి.. కీలక పాత్రల్లో బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ నటిస్తున్నారు.
మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. గతంలో మహేశ్ బాబు, త్రివిక్రం కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. కానీ, ఈ రెండు చిత్రాలతో మహేశ్ కి హిట్స్ దక్కలేదు. బాక్సాఫిస్ వద్ద ‘అతడు’, ‘ఖలేజా’ కమర్షియల్ ్‌గా సక్సెస్ అందుకోలేదు. స్మాల్ స్క్రీన్ మీద మాత్రం ఈ రెండు సినిమాలకి మంచి రేటింగ్ వచ్చింది. అయితే, ‘గుంటూరు కారం’ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది.
Guntur Kaaram: త్రివిక్రం ‘గుంటూరు కారం’ సినిమాతో హిట్ ఇవ్వకపోతే..?
అదేమిటంటే ఈసారి గనక త్రివిక్రం ‘గుంటూరు కారం’ సినిమాతో హిట్ ఇవ్వకపోతే ఇక లైఫ్ లో ఛాన్స్ ఇవ్వడని. సోషల్ మీడియాలో మాత్రమే కాదు మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా ఇదే మాట అంటున్నారు. దీనికి కారణం మహేశ్ సాధారణంగా తనకి ఒక ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సినిమా ఒప్పుకోడు. దీనికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాద్ పోకిరి సినిమాతో మహేశ్ బాబుకి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టాడు. అలాగే, బిజినెస్ మేన్ సినిమా కూడా. కానీ, మహేశ్ కి కథ నచ్చక పూరికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు.
వంశీ పైడిపల్లిది కూడా ఇదే పరిస్థితి. ఇద్దరూ ఎంత క్లోజ్‌గా ఉన్నా కథ విషయంలో మహేశ్ రిస్క్ చేయడు. అలాంటిది త్రివిక్రం రెండు ఫ్లాపులిచ్చినా మూడవసారి ఎందుకనో ఛాన్స్ ఇచ్చాడు. అందుకే, ఈ అవకాశం త్రివిక్రం ఉపయోగించుకోకపోతే ఇదే ఫైనల్..మళ్ళీ మహేశ్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ రావడం చాలా కష్టమని అంటున్నారు. చూడాలి మరి త్రివిక్రం ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారో.