Grandhalayam : గ్రంథాలయం మూవీ రివ్యూ

Grandhalayam : కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు.. అది చిన్నదా.? పెద్దదా.? అన్న తేడాలుండవ్. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఈ మధ్య ఆదరణ పెరుగుతోంది. అదే సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా తీసుకుని ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే “గ్రంధాలయం”. విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియా చౌదరి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ కి జంపాన దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై ఈ సినిమాను నిర్మించారు. విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చి 3 న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైన “గ్రంధాలయం” సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

నటీనటులుః

విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయ ప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీశినాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు

grandhalayam-movie-review

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : అల్లంనేని అయ్యప్ప

రచన దర్శకత్వం : శివన్‌ జంపాన

సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్‌

సంగీతం : వర్ధన్‌

ఎడిటర్‌ : శేఖర్‌పసుపులేటి

బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ఃల్ : చిన్నా

ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు

పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్

 

grandhalayam-movie-review

కథ :

గ్రంధాలయం లో ఉన్న 1965 నాటి బుక్ ను అందరూ చదవలేరు. అయితే చదవాలని ప్రయత్నించి మూడు రోజులు చదివిన తరువాత చదివిన వారందరూ

చనిపోతుంటారు. ఆలా అప్పటి వరకు సుమారు 100 మంది ఆ బుక్ చదివి చనిపోయింటారు. అయితే హీరో రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ (విన్ను మద్దిపాటి), హీరోయిన్ ఇందుమతి వాత్సల్య (స్మితారాణి బోర) ప్రేమించుకుంటారు. అయితే హీరోయిన్ అనుకోకుండా ఈ బుక్ చదవడం మొదలు పెడుతుంది. అయితే రహీరోకు ఆ బుక్ చదివితే 3 రోజుల్లో చనిపోతారానే విషయం తెలుసు, అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆ బుక్ ఎక్కడ నుండి వచ్చింది.ఆ బుక్ ను అక్కడకు తెచ్చిన వారెవరు?. చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని తెలుసుకువాలని హీరో ప్రయత్నిస్తాడు. ఒకరోజు రాత్రి కెమెరా తీసుకొని రహస్యంగా గ్రంధాలయంలోకి వెళ్తాడు . ఆ తరువాత అక్కడ తనకు ఎదురైనా సంఘటనలు ఏమిటి, ఆ బుక్ ను చదివిన హీరోయిన్ ను చనిపోతుందా, లేదా అని తెలుసుకోవాలంటే ఈ సూపర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే..

నటీ, నటులు :

హీరో విన్ను రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయాడు.తన హావ భావాలతో నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇది రాజాది సెకండ్ మూవీ ఇందులో చాలా బాగా నటించాడు. ఇందుమతి వాత్సల్య పాత్రలో నటించిన హీరోయిన్ కొత్త అమ్మాయి. అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీ విశ్వనాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు అంతా వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు :

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు కొత్త కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. దర్శకులు కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు కొత్త కంటెంట్ తో ముందుకు వస్తున్నారు. ఆలా వచ్చిన కొత్త కథే “గ్రంధాలయం “. కలగా వచ్చిన కథను సినిమాగా మార్చి రివర్స్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులని ఆకట్టుకోనేలా సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా మలచడంలో దర్శకుడు సాయి శివన్‌ జంపాన సక్సెస్ అయ్యాడు. సామలభాస్కర్‌ చేసిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు.చిన్నా చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదుర్స్.ఫైట్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. శేఖర్‌పసుపులేటి ఎడిటింగ్ పని తీరు బాగుంది.వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకంపై ఖర్చుకు వెనుకాడకుండా సినిమాపై ఉన్న నమ్మకంతో ఎంతో నిజాయితీగా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలకు ఉన్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ సాయి శివన్‌ జంపాన కు ఉన్న నాలెడ్జ్ తో “గ్రంథాలయం”.సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్లాయి. ఈ సినిమాను నమ్మి వచ్చిన ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుంది.

రేటింగ్ : 2.75.

 

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

6 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.