Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు ఉదయాన్నే ఫైళ్లతో ఆఫీసులకు పరుగులు తీసే సంప్రదాయానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు.
సాధారణంగా ఐటీ కంపెనీలకే పరిమితమైన ఈ ఇంటి నుంచే పని విధానాన్ని, ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లోనూ ప్రవేశపెట్టడం ద్వారా సరికొత్త పాలనా సంస్కరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు స్పందించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా, అనవసర ప్రయాణాలకు బ్రేక్ వేయాలని సర్కార్ నిర్ణయించింది.
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు, భవిష్యత్తులో ప్రపంచమంతా డిజిటల్ మయం కాబోతోందని బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే భౌతికంగా ఆఫీసులకు హాజరు కావాల్సిన అవసరం లేని విభాగాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారానే సమీక్షలు నిర్వహించాలని, ఫైళ్ల కదలికను ఆన్‌లైన్ చేయాలని భావిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రవాణా, విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా.. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని అంచనా.
ప్రస్తుతానికి అన్ని శాఖల్లోనూ కాకుండా, ఎంపిక చేసిన విభాగాల్లో ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టే అవకాశం ఉంది. మరికొన్ని శాఖల్లో హైబ్రిడ్ మోడల్ (వారంలో కొన్ని రోజులు ఆఫీస్, కొన్ని రోజులు ఇల్లు) అమలు చేసేలా మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించే విభాగాలు మినహా, మిగిలిన సెక్షన్ల ఉద్యోగులకు ఈ ఊరట లభించనుంది. త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీవనశైలిలో ఇది ఒక పెను మార్పుగా నిలవనుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.