Srivani Ticket Rules: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో భాగంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఎన్నో రకాల వేసుల బాటలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక దర్శనం టికెట్లను, SSD టోకెన్, మొదటి గడప దర్శనం అంటూ ఇలా ఎన్నో రకాల దర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది అయితే శ్రీవారి మొదటి గడప దర్శన టికెట్ల విషయంలో టిటిడి కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకు మొదటి గడప దర్శనానికి సంబంధించిన శ్రీవాణి టికెట్లను కొండపైనే అందుబాటులో ఉంచేవారు కానీ ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే తీసుకునే వెసులుబాటును కల్పించింది.
స్వామి వారిని మొదటి గడప ద్వారా దర్శనం చేసుకోవడం కోసం శ్రీవాణి టికెట్స్ విడుదల చేశారు.10,500 రూపాయలు చెల్లించి టికెట్స్ పొందవచ్చు. ప్రతిరోజు శ్రీవాణి టికెట్స్ 1500 అందుబాటులో ఉంటాయి. వీటిలో ఇదివరకు 500 టికెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేసేవారు. ఈ టికెట్లను మూడు నెలల ముందే విడుదల చేస్తారు.200 టికెట్స్ రేణిగుంట విమానాశ్రయంలో ఇస్తున్నారు. కరెంట్ డే బుకింగ్స్ 800 ఇస్తున్నారు. ఈ టికెట్లను ఇదివరకు కొండపైన అన్నమయ్య భవన్ దగ్గర ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ 800 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇకపై శ్రీ వాణి టికెట్స్ కొండపై కాకుండా ఆన్లైన్ ద్వారా పొందవచ్చని టీటీడీ తెలియజేసింది. ఈ టికెట్ ధర 10,000+500 రూపాయలు బ్రేక్ దర్శనం టికెట్ కలిపి మొత్తం 10,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. శ్రీవాణి టికెట్స్ ద్వారా ప్రతిరోజు 84 లక్షల రూపాయలు టీటీకి వస్తున్నాయి. ఈ శ్రీవాణి టికెట్స్ పొందిన భక్తులకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మొదటి గడప ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవాణి టికెట్స్ పొందాలనుకునే భక్తులు ఆఫ్ లైన్ ద్వారా కాకుండా ఆన్లైన్ ద్వారా పొందవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.