Typhoid Fever: వర్షాకాలం మొదలవుగానే ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వర్షాలు మొదలైనప్పుడు దోమల బెడద కూడా అధికంగా ఉంటుంది. దోమలు కుట్టడం వల్ల ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే ముందుగానే మనం గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఇక దోమల కారణంగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటారు అయితే ఇలాంటి జ్వరాలు సర్వసాధారణమని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకి ప్రమాదకరంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వారానికి మించి జ్వరం వస్తున్నట్లయితే అది టైఫాయిడ్ కి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి టైఫాయిడ్ లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే..
టైఫాయిడ్ అంటే ముందుగానే కొన్ని లక్షణాలను మన శరీరం తెలియజేస్తుంది వీటిని కనుక గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పెద్ద ప్రమాదం ఉండదు. టైఫాయిడ్ రావడానికి ముందుగా జ్వరం వస్తుంది. మొదట్లో జ్వరం తీవ్రత అధికంగా లేకపోయినా మెల్లిగా జ్వరం తీవ్రత ఎక్కువ అవుతుంది.ఇది టైఫాయిడ్‌కు ప్రధాన లక్షణంగా భావిస్తారు. ఎలాంటి పనులు చేయకపోయినా తొందరగా అలసిపోవడం తీవ్రమైన తలనొప్పి శరీరమంతా బలహీనంగా అనిపించడం కూడా టైఫాయిడ్ లక్షణమని చెప్పాలి.
టైఫాయిడ్ జ్వరం వచ్చిన వారిలో తీవ్రమైన కడుపునొప్పి వికారం, ఆకలి పూర్తిగా తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మరి కొంతమందిలో మలబద్దక లక్షణాలు కూడా ఉంటాయి. ఇక టైఫాయిడ్ సోకినవారు తీవ్రమైన దగ్గు కూడా ఉంటుంది. అలాగే శరీరంపై చిన్నపాటి ఎర్రని మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. ఇలా వారానికి మించి జ్వరం వచ్చి ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతో మంచిది. రక్త పరీక్షల ద్వారా టైఫాయిడ్ గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉండదని చెప్పాలి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.