AP Politics: వైసీపీ నుంచి ఆ మోపిదేవి అవుట్‌.. ఈ మోపిదేవి ఇన్‌!

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మోపిదేవి అనే ఇంటిపేరుకు ఒక ప్రత్యేకమైన వెయిట్ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ రాజకీయాల్లో ఈ పేరు చుట్టూనే చాలాకాలం రాజకీయం తిరిగింది. వైఎస్సార్ హయాం నుంచి మొన్నటి జగన్ ప్రభుత్వం వరకు రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా చక్రం తిప్పిన మోపిదేవి వెంకటరమణ.. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత సైకిలెక్కేశారు. తన వారసుడి భవిష్యత్తు కోసం ఆయన ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే, పాలిటిక్స్ అంటేనే ఊహించని మలుపులు కదా! ఇప్పుడు రేపల్లె నుంచి మరో మోపిదేవి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

గత కొంతకాలంగా బోసిపోయినట్లు కనిపిస్తోన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక్కసారిగా సందడిగా మారింది. దానికి కారణం.. కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు తన అనుచరులు, భారీ క్యాడర్‌తో తరలివచ్చి వైసీపీ కండువా కప్పుకోవడమే. సీనియర్ నేత వెంకటరమణ పార్టీని వీడినా, రేపల్లెలో మోపిదేవి బ్రాండ్ ఇమేజ్ తగ్గలేదని నిరూపించేలా శ్రీనివాసరావు అనుచరుల హడావుడి సాగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఒకే ఇంటిపేరున్న సీనియర్ నేత వెళ్లిన స్థానంలోకి, అదే సామాజికవర్గం, అదే ప్రాంతానికి చెందిన మరో బలమైన నేత రావడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ap-politics-that-mopi-devi-is-out-of-ysrcp-this-mopi-devi-is-in

AP Politics: పార్టీలోకి కొత్త రక్తాన్ని ఆహ్వానించిన జగన్

పార్టీలోకి కొత్త రక్తాన్ని ఆహ్వానించిన జగన్.. అదే సమయంలో రేపల్లె నియోజకవర్గ సమీకరణాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు. సాధారణంగా వేరే పార్టీల నుంచి పెద్ద నేతలు వస్తే టికెట్ ఆశిస్తారు. కానీ, జగన్ మాత్రం ప్రస్తుత ఇంచార్జ్ మోహన కృష్ణకే రాబోయే ఎన్నికల్లో రేపల్లె టికెట్ అని కుండబద్దలు కొట్టారు. కొత్తగా చేరిన మోపిదేవి శ్రీనివాసరావు.. మోహన కృష్ణ గెలుపు కోసం అండగా నిలబడాలని, నియోజకవర్గంలో పార్టీని గెలిపించే పూర్తి బాధ్యతను భుజాన వేసుకోవాలని సూచించారు.

రాజకీయాల్లో కష్టపడే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెబుతూనే, జగన్ ఈ మోపిదేవికి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. రేపల్లెలో వైసీపీ జెండా ఎగరేసి, పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. మోపిదేవి శ్రీనివాసరావును చట్టసభకు పంపుతానని (ఎమ్మెల్సీ ఇస్తానని) జగన్ బహిరంగంగానే హామీ ఇచ్చారు. మొత్తానికి, ఒక మోపిదేవి వెళ్లిన లోటును.. మరో మోపిదేవితో పూడుస్తూనే, అటు క్యాడర్‌లో జోష్ నింపేలా జగన్ వేసిన ఈ పొలిటికల్ స్కెచ్ రేపల్లె రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.