Milk Benefits: సాధారణంగా మనం మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కాల్షియం విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా మనకు లభించాలి అంటే మనం మన ఆహారంలో భాగంగా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఈ క్రమంలోనే చాలామంది ప్రతి రోజు ఉదయం సాయంత్రం పాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది గోరువెచ్చని పాలు తాగగా మరికొందరు వేడివేడిగా ఉన్న పాలన తాగుతూ ఉంటారు. మరి పాలలో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి సక్రమంగా అందాలి అంటే ఎలాంటి పాలు తాగడం మంచిది అనే విషయానికి వస్తే…
ముఖ్యంగా చిన్నపిల్లలకు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు పాలు తాగితే శరీర పెరుగుదలతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం వేడి పాలు తాగిన చల్లని పాలు తాగిన మన శరీరానికి కావలసిన సకల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. తేడా ఏమీ ఉండదు. కాకపోతే మన శరీర తత్వాన్ని, వాతావరణ పరిస్థితులను బట్టి వేడి పాలు తాగడం లేదా చల్లని పాలు తాగడం వంటివి చేస్తుండాలి.
ముఖ్య విషయం ఏమిటంటే పచ్చిపాలను మాత్రం అస్సలు తాగకండి. పచ్చి పాలలో అనేక వ్యాధికారక సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు ఉండడం వల్ల మనలో అనారోగ్య సమస్యలను కలగజేస్తుంది. పాలను బాగా వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా చల్లగా ఉన్నప్పుడైనా నిక్షేపంగా తాగొచ్చు. గుండె జబ్బులు, రక్తపోటు, కీళ్లనొప్పులు వంటి సమస్యతో బాధపడేవాళ్లు పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిది. పాలల్లో అధిక మొత్తం ప్రోటీన్లు క్యాల్షియం మినరల్స్ ఉండటం వల్ల మన శరీరంలో ఎముకలు దృఢత్వానికి అలాగే శరీర ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.