Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎంతో సంతోషంగా ఉండాలని ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా సంతోషంగా ఉండడం కోసం పెద్ద ఎత్తున పూజలు చేస్తూ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలిగి మనకు అష్టైశ్వర్యాలు కలగాలి అంటే కొన్ని వాస్తు పరిహారాలు కూడా పాటించడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లవంగాలు కర్పూరంతో ఈ పరిహారం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
చాలామంది నరదృష్టి తగలడం వల్ల లేదా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడటం చెడు దృష్టి ప్రభావం కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం అనారోగ్య సమస్యల బారిన పడటం జరుగుతుంది అయితే ఇలా మన ఇంట్లో ఏర్పడినటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి ఏ విధమైనటువంటి చెడు ప్రభావం మన ఇంటిపై ఉండకుండా ఉండడానికి లవంగాలు కర్పూర హారతి ఎంతగానో ప్రభావం చూపుతుంది.
మన ప్రతిరోజు దేవుడికి పూజ చేసిన అనంతరం హారతి ఇస్తాము అయితే కర్పూరంతో పాటు లవంగాలను కూడా కలిపి హారతి ఇవ్వటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే కర్పూరం నుంచి లవంగాల నుంచి వెలువడే సువాసన ఇంట్లో కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇలా లక్ష్మీదేవికి ఇలాంటి హారతులు ఇవ్వటం వల్ల ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడటమే కాకుండా మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.