Health Tips: సాధారణంగా చాలామంది నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిది అని భావించి ప్రతిరోజు వారి ఆహార పదార్థాలలో భాగంగా నెయ్యిని తీసుకుంటూ ఉంటారు అయితే మరికొందరు మాత్రం నెయ్యిని తినడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని తద్వారా నెయ్యిని తినడం పూర్తిగా మానేస్తారు. మరి నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదేనా ఒకవేళ మంచిదైతే ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనే విషయానికి వస్తే…
నెయ్యిని ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఇవి మన లోపల కణాలను విచ్ఛిన్నం చేసి జీవక్రియ రేటును మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. ప్రతిరోజు ఆహారంలో భాగంగా నెయ్యిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే నెయ్యి ఆరోగ్యానికి మంచిదే కదా అని భావించి అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొనే పరిస్థితిలు ఉంటాయి. చిన్నపిల్లల విషయంలో నెయ్యి అధికంగా తినిపించడం వల్ల జీర్ణక్రియ రేటు మందగించి తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాక ఇబ్బందులు ఉంటాయి.
మనం మన ఆహారంలో భాగంగా ప్రతిరోజు వంటకాలలో కాస్త నెయ్యిని వేసుకొని తీసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇక తదుపరి ఆహారంలో ఎలాంటి నెయ్యి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఏడో నెల వయసు నుంచి ఏడాదిలోపు ఉన్నటు వంటి వారికి ప్రతిరోజు మూడు నుంచి నాలుగు టేబుల్ టీ స్పూన్ల నెయ్యి అందించడం ఎంతో అవసరం ఇక ఏడాది వయసు దాటిన వారికి ప్రతిరోజు ఒక టేబుల్ టీ స్పూన్ నెయ్యితో వారికి భోజనం తినిపించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. నెయ్యి తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు కానీ మనం దేనిని తీసుకున్న పరిమితికి మించి తీసుకోకూడదు. ఇలా సరైన పరిమాణంలో నెయ్యిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.